బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరక్టర్ కరణ్ కోసం- నిన్నటి సంచలనం కాజోల్, నేటి సంచలనం కరీనా ఓ విషయంలో తీవ్రంగా పోటీపడుతున్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... కరణ్ జోహర్ తాజాగా రూపొందించనున్న మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం కోసం కాజోల్‌ను కొంచెం ఒళ్లు తగ్గించుకుని, నాజూకుగా కనిపించమని ఆదేశిస్తే,రెన్సిల్ డిసిల్వా దర్శకత్వంలో తను నిర్మించబోయే మరో చిత్రం కోసం కరీనా కపూర్‌ను ఒళ్లు పెంచుకోవాల్సిందిగా షరతు విధించాడట. ఇప్పుడున్న జీరో సైజు బాడీతో తన చిత్రంలో కరీనా నటించేందుకు తాను ససేమిరా అంగీకరించనని కరణ్ కరాఖండీగా చెప్పడంతోబాటు, షూటింగ్ మొదలయ్యేలోపు కరీనా ఎన్నో కొన్ని కేలరీలు పెంచుకోవాల్సిందేనని హుకుం జారీ చేసాడంట! ఈ నేపధ్యంలో కేలరీలు తగ్గించుకోవడం కోసం కాజోల్, కేలరీలు పెంచుకోవడం కోసం కరీనా... ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని బాలీవుడ్ వర్గాల కథనం.
Story first published: Saturday, December 27, 2008, 16:36 [IST]