అప్పుడు వాణిశ్రీ,ఇప్పుడు కాజోలట!!!
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి రామానాయుడు తన సంస్థ ద్వారా వచ్చిన సినిమాలలో ఇప్పటివరకు 46మంది హీరోలు, 126 మంది హీరోయిన్లు నటించినట్టు చెబుతున్నాడు. తన చిత్రాలలో నటించిన అందరు హీరోయిన్లు నచ్చినప్పటికీ ఎక్కువగా తన చిత్రాలలో హీరోయిన్ గా చేసిన వాణిశ్రీ అంటే రామానాయుడుకు కొంచెం అభిమానం ఎక్కువేనట. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా చేసిన ప్రేమ్ నగర్ సినిమానే రామానాయుడు సినిమా జీవితానికి టర్నింగ్ పాయింటట. అంతేకాదు.. వాణిశ్రీ ఎంతిష్టమో రామానాయుడు తీసిన ఒక హిందీ సినిమాలో నటించిన కాజోల్ అన్నా అంతే ఇష్టమట. ఇంతకు, వాణిశ్రీ అంటే ఎక్కువిష్టమా లేక కాజో్ అంటే ఎక్కువిష్టమా అనేది రామానాయుడు స్పష్టం చేయలేదు.


Click it and Unblock the Notifications











