»   » కాకతీయ సినీ స్టార్ క్రికెట్ కప్ విశేషాలు...

కాకతీయ సినీ స్టార్ క్రికెట్ కప్ విశేషాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించనున్న స్టార్ క్రికెట్ కప్ ఆగస్టు 23న హైదరాబాద్ లో జరుగనుంది. కాకతీయ కప్ పేరుతో జరుగనున్న ఈ క్రికెట్ పోటీలో చెన్నై హీరోస్‌తో తెలంగాణ స్టార్స్ తలపడనున్నారు. తెలంగాణ స్టార్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ...కళలకు, కళాకారులకు కుల, మత, ప్రాంతీయ బేధాలు లేవు. అవరోధాలు, అపజయాలకు నెరవకుండా కష్టపడి ప్రయత్నిస్తే ఎవరైనా స్టార్‌లుగా ఎదగవచ్చు అన్నారు.

స్టార్ క్రికెట్ కు ప్రాతినిధ్య వహిస్తున్న హీరో ఆకాష్ గురించి రసమయి మాట్లాడుతూ... ఆకాష్ స్వయం కృషితో ఎదిగాడు. ఇక్కడ పుట్టకపోయినా ఈ ప్రాంత మమకారాన్ని హృదయంలో నింపుకున్నాడు. ఇక్కడే కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో స్టార్ క్రికెట్ ప్రారంభించాడు, విమర్శలకు ఎదురొడ్డి ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెలుతున్నాడు అన్నారు.

దాసరి నారాయణరావు వంద మందిని హీరోలుగా చేసాడు కానీ కొడుకును హీరోను చేయలేక పోయాడు. మహేష్ బాబు వెనక కృష్ణ ఉన్నాడు. కానీ ఆకాష్, సంగకుమార్ లాంటి వారు ఎవరి అండ లేకుండా సినీ రంగంలో నిలదొక్కుకున్నారు. కష్టపడి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తే ఎవరైనా విజయం సాధించవచ్చు , ఈక్రమంలో అవమానాలు, అపజయాలు ఉంటాయన్నారు. కాకతీయ కప్ తెలంగాణ కళాకారుల ఎదుగుదలకు తోడ్పడాలి, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఉపయోగ పడాలి అన్నారు రసమయి.

సినీ కార్మికులకు గృహ వసతి కల్పించడానికి మరో చిత్రపురి కాలని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. స్టూడియోలు నిర్మించడానికి సిద్దంగా ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయని రసమయి బాలకిషన్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ స్టార్స్
  

తెలంగాణ స్టార్స్


కాకతీయ కప్ లో తలపడబోతున్న తెలంగాణ స్టార్స్ జట్టు

రసమయి
  

రసమయి

తెలంగాణ స్టార్స్ జెర్సీ ఆవిష్కణ కార్యక్రమంలో మాట్లాడుతున్న రసమయి.

కాకతీయ కప్ పోస్టర్
  

కాకతీయ కప్ పోస్టర్

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగబోతున్న కాకతీయ కప్ పోస్టర్

హీరోయిన్లు
  

హీరోయిన్లు

హీరోయిన్లు సోని చరిష్టా, మనాలీ రాథోడ్

Please Wait while comments are loading...