twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒక్క మాట వల్లే!: ప్రపంచ తెలుగు సభల వేదికపై విశ్వనాథ్ లేని లోటు..

    |

    Recommended Video

    ఆ ఒక్క మాట వల్లే ! నేను ఆ సభకు వెళ్ళలేదు..!

    తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సభలను జనం బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రపంచ మహాసభలకు వేదికగా నిలిచిన ఎల్బీ స్టేడియంలో పలువురు సినీ ప్రముఖులను ప్రభుత్వం ఘనంగా సన్మానించడం విశేషం. పలువురు హీరోలు, దర్శకులు, నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, పీపుల్స్ డైరెక్టర్ నారాయణ మూర్తి, బాహుబలి సృష్టికర్త రాజమౌళి లాంటి వాళ్లు పాల్గొన్న ఈ వేదికపై కళాతపస్వి కె.విశ్వనాథ్ లేకపోవడం లోటుగానే అనిపించింది. అయితే దానికి కారణమేంటో స్వయంగా ఆయనే చెప్పారు. ఇంతకీ ఏంటా విషయం..

    ఆ మాట కోసమే:

    ఆ మాట కోసమే:

    'ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తెలుగువారి ధర్మం.. కొన్ని నెలలముందే తెనాలి ఎన్వీఆర్‌ ట్రస్ట్‌కు మాట ఇచ్చినందునా.. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లలేకపోయాను' అని విశ్వనాథ్ అసలు విషయం చెప్పారు.

     ప్రపంచ తెలుగు సభలకు ఆహ్వానం వచ్చినా!:

    ప్రపంచ తెలుగు సభలకు ఆహ్వానం వచ్చినా!:

    ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని ఆదివారం సాయంత్రం తనకు ఆహ్వానం అందిందని కె.విశ్వనాథ్ తెలిపారు. అయితే కొన్ని నెలల ముందే తెనాలి ఎన్వీఆర్ ట్రస్టు వారికి.. ఇక్కడి కార్యక్రమానికి వస్తానని మాట ఇచ్చినందువల్ల అక్కడికి వెళ్లలేకపోయానని చెప్పారు. మాటకు కట్టుబడటం తెలుగువారి ధర్మం అని, అందుకే మాటకు కట్టుబడి తెనాలి ఎన్వీఆర్ ట్రస్టుకు వచ్చానని అన్నారు.

    అవార్డు స్వీకరణ:

    అవార్డు స్వీకరణ:

    ఎన్వీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తెనాలిలోని నాజరుపేట ఎన్వీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కె.విశ్వనాథ్ నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డు అందుకున్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ విశ్వనాథ్‌కు అవార్డు అందజేశారు.

     సినిమా పుణ్యక్షేత్రం:

    సినిమా పుణ్యక్షేత్రం:

    భగవంతుడు తననొక దర్శకుడిని చేసి, సినిమా మీడియా అనే బస్సులోని భక్తులను జాగ్రత్తగా సినిమా అనే పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లమని ఆదేశించాడని కె.విశ్వనాథ్ అన్నారు. ఆ పనిని తాను జాగ్రత్తగా నెరవేర్చానని చెప్పారు.

    English summary
    Classical director of Telugu films, Kala Thapasvi K.Viswanath hounoured with Nannapaneni Venkatrao award in Tenali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X