twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళాభవన్‌ మణి కి నివాళి: ఆటో నడిపే మిమిక్రీ ఆర్టిస్ట్...మోస్ట్ వాంటెడ్ విలన్ గా

    By Srikanya
    |

    కొచ్చి:ప్రముఖ నటుడు కళాభవన్‌ మణి (45) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ , కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకి భార్య డా.నిమ్మి, కూతురు శ్రీలక్ష్మి ఉన్నారు.

    'నటుడు కళాభవన్ శనివారం కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు' అని వైద్యులు తెలిపారు.

    మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన కళాభవన్.. మలయాళ చిత్ర సీమ నుంచి నట ప్రయాణం మొదలుపెట్టి తెలుగు, తమిళంలోనూ నటించి పేరు తెచ్చుకొన్నారు. తెలుగులో ‘జెమిని' చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపొచ్చింది. అందులో పక్షుల్లాగా, జంతువుల్లాగా అనుకరిస్తూ విలన్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.

    కళా భవన్ గురించి మరిన్ని విశేషాలు...

    తెలుగులో

    తెలుగులో

    ‘అర్జున్‌', ‘నరసింహుడు', ‘ఎవడైతే నాకేంటి' చిత్రాల్లోనూ మణి కీలక పాత్రలు పోషించారు.

    జెమినీ

    జెమినీ

    ముఖ్యంగా తెలుగులో ఆయన నటించిన చిత్రం అనగానే గుర్తొచ్చేది జెమినీనే.

    జెమినీ

    జెమినీ

    జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్ తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు.

    కళాభవన్‌ మణి

    కళాభవన్‌ మణి

    కళాభవన్‌ మణి అసలు పేరు మణిరామన్‌. కేరళలోని చలక్కుడిలో జన్మించారు.

    ఆటోడ్రైవర్‌గా

    ఆటోడ్రైవర్‌గా

    స్వతహాగా మిమిక్రీ కళాకారుడైన ఆయన పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఒకపక్క మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ, మరోపక్క ఆటోడ్రైవర్‌గా పనిచేసేవారు.

    తొలి అవకాసం

    తొలి అవకాసం

    ఈ సమయంలో ఆయనకి ‘అక్షరం' అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

    కంటిన్యూగా..

    కంటిన్యూగా..

    ఆ చిత్రం తర్వాత 200కిపైగా సినిమాల్లో విలన్ గా, హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులకి వినోదాన్ని పంచారు.

    అవార్డులు

    అవార్డులు

    మలయాళ చిత్రం ‘వసంతియుమ్‌ లక్ష్మియుమ్‌ పిన్నే న్యాణుం'లో నటనకిగానూ మణికి జాతీయ పురస్కారం (స్పెషల్‌ జ్యూరీ) లభించింది.

    రాష్ట్ర ప్రభుత్వం నుంచి..

    రాష్ట్ర ప్రభుత్వం నుంచి..

    1999లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు.

    సింగర్, సంగీత దర్శకుడు

    సింగర్, సంగీత దర్శకుడు

    మణిలో మంచి నటుడితోపాటు నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడూ ఉన్నారు. పలు చిత్రాల్లో గీతాల్ని ఆలపించడంతోపాటు, కొన్ని చిత్రాలకి సంగీతం అందించారు.

    స్టోరీ రైటర్ కూడా

    స్టోరీ రైటర్ కూడా

    ఓ చిత్రానికి కథ అందించారు.

    నివాళి

    నివాళి

    కళాభవన్‌ మణి మరణంతో దక్షిణాది చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కు వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.

    English summary
    Venkatesh’s Gemini film fame , Malayalam actor Kalabhavan Mani passed away in Kochi. He suffered from liver ailment and hospitalised at Amrita Hospital in Kochi. Amrita Institute of Medical Sciences reports state that he was bleeding haematemesis (vomiting of blood) when he was admitted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X