twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళాభవన్ మణి మృతి అసహజం, అనుమానాలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : కళాభవన్ మణి నిన్న (ఆదివారం) సాయంత్రం ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కాలేయ సంభంధ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇది కేరళ పోలీసులు ఈ మృతిని అసహజ మరణం గా కేసు నమోదు చేసారు. ఆయన శరీరంలో మిధైల్ ఆల్కహాల్ ఉండటం గమనించంలో ఇలా కేసుని రిజిస్టర్ చేసామని చెప్పారు. ఈ మృతిపై సందేహాలు వ్యక్తం చేసారు.

    ఈ విషయమై ఆయన సోదరుడు రామకృష్ణన్ ...సెక్షన్ 174 క్రింద ఎఫైర్ ఫైల్ చేసారు . దాంతో కంప్లైంట్ తీసుకున్న స్టేషన్ కు చెందిన పోలీస్ సర్కిల్ ఇన్సిపెక్టర్ తో పాటు ఓ టీమ్ ని ఈ కేసు ని డిప్యూటి సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్ సుధాకరన్ ఆధర్వంలో నియమించటం జరిగింది.

    త్రిసూల్ రూరల్ ఎస్సై కార్తీక్ మాట్లాడుతూ.. " ఎఫైర్ ని ఫైల్ చేసాం, డాక్టర్స్ ని, మిగతా వారని క్వచ్చిన్ చేస్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్, మిగతా మెడికల్ రిపోర్ట్ లు వచ్చిన తర్వాత పూర్తి ధృవీకరణకు రాగలం ." అన్నారు.

    Kalabhavan Mani: Police register Malayalam actor death as unnatural

    మొదట ఆయన శరీరాన్ని ఆయన ఎక్కడైతే మరణించారో... అదే ( కొచ్చిలోని అమృత) హాస్పటిల్ లోని మార్చురికి షిప్ట్ చేసారు. తర్వాత దాన్ని త్రిసూర్ లోని మెడికల్ కాలేజి కు తరలించారు.

    మణి శరీరంలో మిధైల్ ఆల్కహాల్ ఉందని వస్తున్న వార్తలపై మాట్లాడుతూ... ఇప్పుడేం ఏం చెప్పలేం...ఏ విషయంలోనూ కంక్లూజన్ కు రాలేం. మెడికల్ రిపోర్ట్ లు రావాల్సిందే అని తేల్చి చెప్పారు పోలీసులు.

    ఇక శనివారం ఆయన త్రిసూర్ లోని తన అవుట్ హౌస్ లో కాన్షష్ లో లేని స్దితిలో హాస్పటిల్ కు తరలించారు. మొదట ఆయన్ను లోకల్ హాస్పటిల్ లో ఎడ్మిట్ చేసారు. అయితే కండీషన్ మరీ చేజారిపోయేటట్లు ఉండటంతో ఎలర్టై అమృత హాస్పటిల్ కు పంపారు.

    అమృత హాస్పటిల్ లో ఆయన శరీరంలో మోతాదు కు మించిన మిధైల్ ఆల్కహాల్ ఉండటం గమనించి, పోలీసులను ఎలర్ట్ చేసారు. కానీ ఆ పరిస్దితుల్లో మణి మాట్లాడే స్ధితిలో లేకపోవటంతో స్టేట్ మెంట్ తీసుకోలేకపోయారు. అయితే పోలీసులు అవుట్ హౌస్, ఆయన ఇంటి దగ్గరలోనూ, ఆయన ముగ్గరు స్నేహితులతో గడిపిన చోట సెర్చ్ చేసారు. ఆయన స్నేహితుల నుంచి కూడా స్టేట్ మెంట్ తీసుకోనున్నారు.

    మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందిన ఆయన 'అక్షరం' అనే మలయాళ సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 200కు పైచిలుకు సినిమాల్లో విలన్, హాస్య పాత్రల్లో నటించిన కళాభవన్ మణి 'వాసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నెన్జానుమ్' (ఈ సినిమానే తెలుగులో ఆర్.పి. పట్నాయక్ 'శ్రీను వాసంతి లక్ష్మీ' పేరుతో రీమేక్ చేశారు) సినిమాతో జాతీయ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ) అందుకున్నారు.

    నెగిటివ్ పాత్రలకు మిమిక్రీ జోడించి దక్షణాది ప్రేక్షకులకు చేరువైన మణి తెలుగులో 'జెమిని', 'ఆయుధం', 'అర్జున్', 'నరసింహుడు', 'ఎవడైతే నాకేంటి' సినిమాల్లో నటించారు. 1971 జనవరి 1న కేరళలోని చలక్కుడిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు రాకమునుపు ఆటో డ్రైవర్‌గానూ పనిచేశారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగాను చేసిన మణి ఓ సినిమాకు కథ కూడా అందించారు.

    ''ఆయన మృతి భాదాకరం'' అంటూ మణి మృతి పట్ల పి.ఎం.ఓ సంతాపం తెలిపింది. దక్షిణాది చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు కూడా ఆయనకు సంతాపం ప్రకటించారు.

    English summary
    Some media reports suggest that traces of methyl alcohol were found in Kalabhavan Mani's body. “It is too early to say anything, let is not jump to concisions. Let the medical reports come,” Karthik said. 45-year-old Kalabhavan Mani’s death has come as a huge shock for his fans and the Malayalam film industry, many of his friends unable to even react to the tragedy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X