అధికారులతో దురుసుగా ప్రవర్తించిన సినిమా విలన్
హైదరాబాద్: తెలుగుతో పాటు, పలు దక్షిణాది సినిమాల్లో తన విలనిజంతో అలరించిన నటుడు కళాభవన్ మణి తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. విదేశాలకు వెళ్లి ఆదివారం తిరిగి వస్తున్న ఆయన కొచ్చి ఎయిర్ పోర్టులో అధికారులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కస్టమ్స్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం. తన చేతికి ఉన్న గోల్డ్ బ్రాస్‌లెట్ వివరాలు అడిగినందుకు మణి అధికారులతో దురసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అధికారులు ప్రశ్నించగానే తన చేతికి ఉన్న బ్రాస్ లెట్ తీసి అధికారుల ముందు పడేసి కోపంగా వెళ్లి పోయిట్లు చెబుతున్నారు.

అయితే మణి మాత్రం అధికారుల ఆరోపణలను ఖండిస్తున్నారు. పోలీసుల, కస్టమ్స్ అధికారులే తనను వేధించి వదిలి పెట్టారని అంటున్నారు. 'నన్ను వారు బ్రాస్ లెట్ గురించి అడిగారు. నేను కొన్ని సంవత్సరాలుగా దీన్ని ధరిస్తున్నాను అని తెలిపాను. నేను వారితో దురుసుగా మాట్లాడలేదు. ఎయిర్ పోర్టులోని సిసిటీవీ పుటేజీ పరిశీలిస్తే అసలు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది' అని కళాభవన్ మణి రిపోర్టర్స్‌తో అన్నారు.
గతంలో కూడా మణి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన కారుకు ఫారెస్టు అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినపుడు వారితో దురుసుగా ప్రవర్తించారు. ఫారెస్టు గార్డులపై దాడి చేసారు. తాజాగా ఇపుడు కస్టమ్స్ అధికారులతో కూడా మణి ప్రవర్తన వివాదాస్పదం కావడం చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











