twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అధికారులతో దురుసుగా ప్రవర్తించిన సినిమా విలన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగుతో పాటు, పలు దక్షిణాది సినిమాల్లో తన విలనిజంతో అలరించిన నటుడు కళాభవన్ మణి తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. విదేశాలకు వెళ్లి ఆదివారం తిరిగి వస్తున్న ఆయన కొచ్చి ఎయిర్ పోర్టులో అధికారులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    కస్టమ్స్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం. తన చేతికి ఉన్న గోల్డ్ బ్రాస్‌లెట్ వివరాలు అడిగినందుకు మణి అధికారులతో దురసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అధికారులు ప్రశ్నించగానే తన చేతికి ఉన్న బ్రాస్ లెట్ తీసి అధికారుల ముందు పడేసి కోపంగా వెళ్లి పోయిట్లు చెబుతున్నారు.

    Kalabhavan Mani

    అయితే మణి మాత్రం అధికారుల ఆరోపణలను ఖండిస్తున్నారు. పోలీసుల, కస్టమ్స్ అధికారులే తనను వేధించి వదిలి పెట్టారని అంటున్నారు. 'నన్ను వారు బ్రాస్ లెట్ గురించి అడిగారు. నేను కొన్ని సంవత్సరాలుగా దీన్ని ధరిస్తున్నాను అని తెలిపాను. నేను వారితో దురుసుగా మాట్లాడలేదు. ఎయిర్ పోర్టులోని సిసిటీవీ పుటేజీ పరిశీలిస్తే అసలు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది' అని కళాభవన్ మణి రిపోర్టర్స్‌తో అన్నారు.

    గతంలో కూడా మణి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన కారుకు ఫారెస్టు అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినపుడు వారితో దురుసుగా ప్రవర్తించారు. ఫారెస్టు గార్డులపై దాడి చేసారు. తాజాగా ఇపుడు కస్టమ్స్ అధికారులతో కూడా మణి ప్రవర్తన వివాదాస్పదం కావడం చర్చనీయాంశం అయింది.

    English summary
    South Indian cine actor Kalabhavan Mani today ran into trouble over alleged rude behavior with Customs officials at the airport here over a gold bracelet he wore when he landed here after a foreign tour. According to Airport Customs sources, Mani spoke in a rude manner to the officials on duty while they raised questions about a bracelet he had on his wrist. The actor then allegedly threw the bracelet at the counter and rushed out of the terminal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X