మణిరత్నం ‘కడలి’ ఆడియో డైరెక్ట్‌గా రిలీజైంది
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'కడలి' చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో నేరుగా మార్కెట్లోకి నిన్న విడుదలైంది. ఫంక్షన్ నిర్వహించి ఆర్భాటంగా ఆడియో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ...చివరి నిమిషయంలో మనసు మార్చుకున్న నిర్మాతలు.....ఎలాంటి ఫంక్షన్ లేకుండానే డైరెక్టర్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. చిట్టి జాబిల్లి...
2. యాడికే...
3. పచ్చని తోట..
4. ఎల్లే జెల్లే..
5. గుంజుకున్న.,.
6. మమతె నవ్వెలే..
7. మగిడి మగిడి..
కడలి సినిమా విశేషాల్లోకి వెళితే...సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా...వనమాలి సాహిత్యం సమకూర్చారు. తాజాగా ఈచిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 1న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ హీరో కార్తీక తనయుడు గౌతమ్, మాజీ హీరోయిన్ రాధ రెండవ కూతురు తులసి 'కడలి' చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం అవుతున్నారు. మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది. మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్నారు.
దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications












