మరో తమిళ రీమేక్ కమిటైన అల్లరి నరేష్
తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు' అనే సినిమా రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. రీసెంట్ గా నరేష్ - సత్తిబాబు కలయికలో 'యముడికి మొగుడు' వచ్చింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. తమిళంలో సూపర్ హిట్టైన 'కలగలప్పు' ఇద్దరికీ విజయం తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.
ఇక 'కలగలప్పు' చిత్రం ఇద్దరు స్నేహితులు తమ వారసత్వంగా వచ్చిన రెస్టారెంట్ ని ఓ రియల్ ఎస్టేట్ డవలపర్ నుంచి కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలతో రూపొందింది. ఈ చిత్రం సోల్ కిచెన్ అనే జర్మినీ చిత్రం ఆధారంగా రూపొంది తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది.
ప్రస్తుతం అల్లరి నరేష్ ... బ్లేడ్ బాబ్జీ ఫేమ్ దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న 'కెవ్వు కేక' లో కనిపించి నవ్వించనున్నారు. షర్మిల మాంద్రే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లరి నరేష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. కెవ్వుకేక చిత్రంతో పాటు, యాక్షన్ 3డి చిత్రాలు చేస్తున్నారు. మే నెల వరకు ఈరెండు చిత్రాలకు సంబంధించిన పనులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత అల్లరి నరేష్-వరలక్ష్మి కాంబినేషన్లో సాయి కిషోర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications












