డుమ్మా కొట్టిన అంజలిపై దర్శకుడి ఫిర్యాదు
చెన్నై : ఇటీవల ఐదు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన హీరోయిన్ అంజలి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లే కొన్ని గంటల ముందు ఆమె తన పిన్ని భారతీదేవిపై, దర్శకుడు కళంజియంపై వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేయడంతో ఆమె అదృశ్యం సంచలనం సృష్టించింది.
కాగా..తాజాగా తమిళ దర్శకుడు కళంజియం తమిళ సినిమా సంఘాలను ఆశ్రయించి అంజలిపై ఫిర్యాదు చేసారు. అంజలి తమ సినిమాలో నటిస్తానని చెప్పి డేట్స్ ఇచ్చిందని, ఇప్పుడు రాకుండా మొరాయిస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంజలి షూటింగుకు వచ్చేలా చేయాలని కోరారు.
ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందని, సెకండ్ షెడ్యూల్ మొదలు పెడదామంటే అంజలి రావడం లేదు, అసలే అది హీరోయిన్ ప్రధానంగా సాగే సినిమా, ఆమె లేకుండా చిత్రీకరణ జరుపలేం. ఆమె రాక పోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం అని కళంజియం పేర్కొన్నారు. ఇప్పటికే సినిమాకు రూ. 40 లక్షలు ఖర్చు చేసామని కళంజియం గతంలో పేర్కొన్నారు.
కాగా..మరో వైపు అంజలి పిన్ని భారతీదేవి అంజలి అదృశ్యమైందంటూ వేసిన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. రేపు(ఏప్రిల్ 26)న అంజలి తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అంజలి ప్రస్తుతం వెంకటేష్, రామ్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'బోల్ బచ్చన్' షూటింగులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











