ట్విస్ట్: అంజలిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్శకుడు
నేను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు అంజలి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, వాళ్ల పిన్ని భారతీదేవి ఏమైనా సమస్యలు వస్తే నన్ను సలహా అడిగేదని, దానికి నేను నాకు తోచిన పరిష్కారం చెప్పేవాడిని, అంతకు మించి అంజలి వ్యవహారంలో తాను జోక్యం చేసుకున్న సందర్భాలేవీ లేవన్నారు. అంజలి మా సినిమా కోసం మే 26 వరకు కాల్ షీట్స్ ఇచ్చింది. ఆ కాల్ షీట్ల ప్రకారం ఆమె మా సినిమాలో నటించి తీరాల్సిందే అని దర్శకుడు కళంజియం తెలిపారు.
తనకు 15 సంవత్సరాలుగా అంజలి కుటుంబీకులు తెలుసు. అయితే భారతిదేవి అంజలి తల్లి కాదనే విషయం ఇప్పుడే తెలిసింది. అంజలిని కట్రదు తమిళ్ సినిమా ద్వారా తానే తెరకు పరిచయం చేశానని కలంజియం వెల్లడించారు. ఇప్పటి వరకు ఆమె ఎదుగుదలకు మాత్రమే శ్రమించానని తెలిపారు.
అంజలి ఆరోపణలు :
'' నా వెంటే ఉంటూ నాకు గోతులు తవ్వారని, ఇప్పుడు నా వద్ద చిల్లిగవ్వ లేకుండా నా ఆస్తి అంతా మింగేశారని, ఇప్పుడు చిత్ర హింసలు పెడుతున్నారని" అంజలి తన పిన్ని భారతీ దేవిపై మండి పడింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించింది. నా సొంత అక్క, అన్నలతో కూడా మాట్లాడనీయకుండా చిత్రహింసలు పెడుతున్నారని, నా ప్రాణాలకు వీరి నుండి ముప్పు ఉందని, ఏం జరిగినా వీరిదే భాధ్యత అని తేల్చిచెప్పింది. వీరితో పాటు దర్శకడు కలంజియం కూడా నన్ను మోసం చేశారని, నేను మేజర్ ను అయ్యాను కాబట్టి వీరికి దూరంగా ఉండాలని హైదరాబాద్ లో ఉంటున్నానని మీడియాకు తెలిపింది.


Click it and Unblock the Notifications












