ఆర్థిక కష్టాల్లో దర్శకుడు: హీరోయిన్ అంజలికి రిక్వెస్ట్
హైదరాబాద్: హీరోయిన్ అంజలి, తమిళ డైరెక్టర్ కళంజియం మధ్య గొడవ గురించి అందరికీ తెలిసిందే. అంజలి తన వద్ద అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇచ్చి షూటింగులకు రావడం లేదని కళంజియం కోర్టు వరకు వెళ్లారు. తన పిన్నితో కలిసి కళంజియం తనను డబ్బు కోసం వేధిస్తున్నారంటూ అంజలి వాదిస్తూ వస్తోంది.
గత కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉంది. ఆ మధ్య కళంజియం కేసు వ్యవహారం గురించి అంజలి మీడియాతో మాట్లాడుతూ...ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని, అన్ని విషయాలు అక్కడే తేలుతాయని స్పష్టం చేసింది.

కాగా...ఇటీవల కళంజియం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కళంజియం స్నేహితుడు చనిపోగా, తీవ్రగాయాల పాలైన కళంజియం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే చికిత్స కోసం డబ్బు బాగా అవసరం కావడంతో తనకు రావాల్సిన డబ్బు కోసం అంజలికి రిక్వెస్ట్ పంపినట్లు తెలుస్తోంది. గతంలో తన వద్ద తీసుకున్న అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇవ్వాలని కళంజియం ఆసుపత్రి బెడ్ నుండే వేడుకుంటున్నాడట.
మొన్నటి వరకు కోర్టుల చుట్టూ తిరిగిన కళంజియం ఇపుడు ప్రమాదానికి గురై...తన డబ్బు ఇవ్వాలని అంజలిని వేడుకోవడం చర్చనీయాంశం అయింది. వీరిద్దరి మధ్య సాగుతున్న డబ్బు విషయంలో నిజా నిజాల సంగతి మనకు తెలియదు కానీ.....కళంజియం దీన స్థితికి అంజలి స్పందన ఎలా ఉంటుంది అనేది హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











