ఆ సినిమాని రీమేక్ చేస్తారా?
సంగీత ప్రధానంగా స్వాతి, కమల్ కామరాజు కాంబినేషన్లో వచ్చిన కలవరమాయే మదిలో చిత్రం భాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం తమిళ్, హిందీలోకి రీమేక్ కానుందని సమాచారం. ఈ మేరకు భరణి మినరల్స్ వారు రైట్స్ కొన్నట్లు ప్రకటన వచ్చింది. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో అంతా ఆశ్చర్య పోతున్నారు. ఓ వారం కూడా ఆడకుండా ఓ మాదిరి కలెక్షన్స్ కూడా పొందని ఆ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకోవటమేమిటని అంటున్నారు. ఇక ఆ రీమేక్ లోనూ స్వాతినే పెడతారా అన్నది తెలియరావటం లేదు. అయితే స్వాతి కి తమిళంలో ఉన్న క్రేజ్ ని బట్టి డబ్బింగ్ చేస్తారని అప్పట్లో అంతా అనుకున్నారు. ప్రస్తుతం స్వాతి..విక్రమ్ సరసన నటిస్తోంది. మహేష్, పవన్ లతో చిత్రాలు నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కలర్స్ స్వాతి కలవరమాయే మదిలో సతీష్ హోప్ విక్రమ్ సెల్వరాఘవన్ కమల్ కామరాజు kalavaramaye madilo sathish kamal kaamaraju musical vikram


Click it and Unblock the Notifications