సుశాంత్ "కాళిదాసు" ఆడియో 28న

అక్కినేని నాగార్జున మరో మేనల్లుడు సుశాంత్ నటిస్తున్న "కాళిదాసు" సినిమా ఆడియో ఈనెల 28న విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో మార్చి 20 నే విడుదల కావలసి ఉన్నప్పటికీ శోభన్ బాబు మృతి తదితర కారణాల వల్ల 28 కి వాయిదా పడింది.
ఈ సినిమాకు చక్రి సంగీత దర్శకుడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది. సినిమాలో సుశాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను చింతలపూడి శ్రీనివాస్, ఎ నాగ సుశీల నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 11 న సినిమాను విడుదల చేయనున్నట్టు సహ నిర్మాత నాగ సుశీల చెప్పారు. పబ్లిసిటీ వినూత్న రీతిలో చేయనున్నట్టు ఆమె తెలిపారు.


Click it and Unblock the Notifications











