కొంతలో కొంత కాళిదాసే మేలు..

ఇక 'భలే దొంగలు' తమకు మించిన ఆశలతో రోడ్డున పడి ప్రమాదాలు పాలై తిరిగి తమలో ఉన్న మంచితనంతోనే సేవయ్యే ఓ జంట కథ ఇది. బాలీవుడ్ హిట్ 'బంటి ఔర్ బబ్లి 'ఆధారంగా రూపొందించిన ఈ కథ చాలా వరకు ఒరిజనల్ నే ఫాలో అయ్యారు. హీరో హీరోయిన్లు తరుణ్,ఇలియానా లు కాస్త కామిడీగా నవ్వించినా సెంటిమెంటు పాలు ఎక్కువై భాక్సాఫీసు వద్ద గెలిచేటట్లు లేరు. బెల్లంకొండ సురేష్ సమర్పణలో శాఖమూరి పాండురంగారావు నిర్మించిన ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకుడు.
ఇక 'గీత' సినిమా హాలివుడ్ సినిమా' ఫోన్ బూత్' ను ఫ్రీమేక్ చేసినా ఫలితం కనపడటం లేదు. రిషి,శ్రేయజ,హంసా నందిని హీరో,హీరోయిన్లు గా నటించిన చిత్రమిది. తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమా తీసినా అదే రేంజిలో మరీ తక్కువ మంది ప్రేక్షకులు రావటంతో పెట్టుబడికి ఇబ్బందే. నూతన దర్శకుడు సూర్యతేజ డైరక్ట్ చేసిన ఈ చిత్రాన్నిడా.రవికుమార్ పంపన,డా.కె.హరినాధబాబు నిర్మంచారు.
ఇలా విభిన్న ఇతివృత్తలతో వచ్చిన ఈ మూడు సినిమాలు కాలక్షేపానికి లోటు లేని విధంగా ఉండటం విశేషం.వీటిల్లో కాళిదాసు బి.సి.సెంటర్లపై ఆస పెట్టుకోవచ్చు.


Click it and Unblock the Notifications











