twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్వేతా మీనన్ రియల్ డెలివరీ సీన్‌పై వివాదం

    By Bojja Kumar
    |

    చెన్నయ్ : మళయాల నటి, 2004 మిస్ ఇండియా రన్నరప్ శ్వేతా మీనన్ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సెంబర్ 27న ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె 'కాలి మన్ను' అనే మళయాల చిత్రంలో నటిస్తుండటంతో సహజత్వం కోసం ఆమె రిలయ్ డెలివరీ సీన్లను కూడా సినిమా కోసం చిత్రీకరించారు.

    తాజాగా ఈ చిత్రంపై వివాదం రాజుకుంది. శ్వేతా మీనన్ రియల్ డెలివరీ సీన్లను సినిమా కోసం చిత్రీకరించడంపై కేరళ అసెంబ్లీ స్పీకర్ జి. కార్తికేయన్ అభ్యంతం వ్యక్తం చేస్తారు. ఇటీవల ఈ విషయమై స్పందిస్తూ...'ఆడవారిని కమర్షియల్ యాడ్లలో, సినిమాల్లో అసభ్యంగా చూపిస్తున్నారని పోరాటాలు చేసే మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. మహిళ ప్రసవం ఎంతో పవిత్రమైనది. దాన్ని ఇలా కమర్షియల్‌గా డబ్బులు సంపాదించడానికి సినిమా కోసం వాడుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసారు.

    అయితే సినిమా యూనిట్ సభ్యుల వాదన మాత్రం వేరేలా ఉంది. డెలివరీ సమయంలో మహిళ ఎమోషన్స్, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలు సినిమాలో ఉండటం వల్లే సహజత్వం కోసం రియల్ డెలివరీ సీన్ చిత్రీకరించామని అంటున్నారు. ఇందులో మహిళలను కించ పరిచేలా సీన్లు ఉండవని స్పష్టం చేస్తున్నారు.

    'కాలి మన్ను' చిత్రానికి బ్లెస్సీ దర్శకతవం వహిస్తున్నారు. బిజు మీనన్ ఈచిత్ర కథాయకుడి పాత్ర చేస్తున్నాడు. శ్వేతా మీనన్ తెలుగులో 'రాజన్న' చిత్రంలో దొరసాని పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆమె నటించిన 'రతి నిర్వేదం' చిత్రం కూడా ఆ మధ్య తెలుగులో విడుదలైన హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    Shweta Menon's Childbirth scene in "Kalimannu" kicks up row. Speaker of the Assembly G Karthikeyan raked up the issue recently. Speaking at a function in Alappuzha, Karthikeyan questioned why women organisations, which protest indecent portrayal of women in advertisements, are silent on the “delivery that was filmed live for a movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X