హీరోయిన్ బాడీపై ప్రభాస్ పేరు.. పాన్ ఇండియాను షేక్ చేస్తోన్న టాటూ
ఇండియా వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్‌లో స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ దిశా పటానీ ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన అందం, అభినయంతో మాయ చేస్తోన్న ఈ చిన్నది..
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దిశా పటానీ చేతిపై ఉన్న టాటూ ఒకటి కలకలం రేపుతోంది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

టాలీవుడ్‌తోనే మొదలైంది
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తన అందాలతో అందరినీ మాయ చేయడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా మారింది. కానీ, ఈ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా దిశా పటానీ టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చేసింది.

అక్కడ వరుస చిత్రాలతో
సినిమా కెరీర్‌ను సరిగా ఆరంభించని దిశా పటానీ.. 'MS Dhoni' చిత్రంతో హిందీ పరిశ్రమలోకి వెళ్లింది. ఇది భారీ సక్సెస్ అవడంతో ఆమెకు అక్కడ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా స్టార్‌డమ్ కూడా అందుకున్న దిశా.. 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలతో వచ్చి యమా అలరించింది.
భారీ చిత్రాల్లో దిశా భాగం
అనతి కాలంలోనే నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న దిశా పటానీ.. హిందీ చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో వేరే భాషల్లో పాన్ ఇండియా చిత్రాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సూర్యతో 'కంగువా', 'యోధా' అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లు కూడా చేస్తోంది. ఫలితంగా ఫుల్ బిజీగానే గడుపుతోంది.

కల్కి చిత్రంతో మరింతగా
ప్రస్తుతం దిశా పటానీ ఎన్నో చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె పాత్ర గ్లామరస్‌గా ఉండడంతో యమా హైలైట్ అయింది. ఫలితంగా ఈ చిత్రంతో ఆమె పేరు మరోసారి సెన్సేషన్ అవుతోంది. దీంతో సౌత్‌లోనూ దిశా పటానీ క్రేజ్ రెట్టింపు అయిపోతోంది.

దిశా పటానీ టాటూ వైరల్
బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోన్న బోల్డు బ్యూటీ దిశా పటానీ.. చేతి నిండా ఆఫర్లతో తీరక లేకుండానే గడుపుతోంది. అదే సమయంలో తరచూ బయట పార్టీలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దిశా పటానీ చేతిపై 'పీడీ (PD)' అనే టాటూ కనిపించింది. దీంతో ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోతోంది.

ప్రభాస్ పేరు అని ట్రెండ్
దిశా పటానీ చేతిపై 'పీడీ (PD)' అనే టాటూ కనిపించడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో పీడీ అంటే 'ప్రభాస్, దిశా పటానీ' అని కొందరు 'ప్రభాస్, డార్లింగ్' అని మరికొందరు చెప్తున్నారు. 'కల్కి 2898 ఏడీ' మూవీలో నటించడం వల్ల ఆమె ప్రభాస్ పేరును పచ్చబొట్టు వేసుకుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











