Kalki 2898 AD 2:సైలెంట్ గా కల్కి 2898 AD పార్ట్ 2.. ఈసారి ఆ ముగ్గురే హైలైట్ అట..

భారతీయ సినిమా గర్వించదగ్గ అతి కొన్ని సినిమాల్లో మన తెలుగు నుంచే పలు సినిమాలు ఉంటాయని చెప్పాలి. కాగా చత్రాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లిన హీరో ప్రభాస్ నటించిన సినిమాలే ఉండగా వాటిలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ "కల్కి 2898 ఎడి" కూడా ఒకటి. సైఫై జానర్ లో మన భారతీయ పురాణాలు జోడించి తీసిన ఈ సినిమా గత ఏడాది వచ్చి రికార్డు వసూళ్లు సాధించింది.

ఇండియన్ సినిమా దగ్గర బహుశా పార్ట్ 1 గా వచ్చి అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా కూడా ఇదే కావచ్చని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా నాగ్ అశ్విన్ అనౌన్స్ చేయగా వరల్డ్ ఆడియెన్స్ ఎంతగానో థ్రిల్ అయ్యారు. ఇక నెక్స్ట్ రానున్న పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ పార్ట్ 2 విషయంలో నిర్మాత అశ్విని దత్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

kalki 2898 ad part 2 shoot going silently these three will be big highlight

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం కల్కి పార్ట్ 2 విశేషాలు గట్టిగానే ఉండేలా ఉన్నాయని చెప్పాలి. కాగా ార్ట్ 1 లో ప్రభాస్ అలాగే యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ కి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది అని తెలిసిందే. కాగా దీనికి దర్శకుడు రెండో భాగంలో చెక్ పెడతా అని కూడా చెప్పడం జరిగింది. ఈనేపథ్యంలో అశ్వినీదత్ కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి.

పార్ట్ 2 లో ఇన్ని రోజులు ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసింది. కానీ వీరితో పాటుగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పై ూడా ఓ రేంజ్ లో సన్నివేశాలు ఉంటాయట. ఇలా ముగ్గురు పాత్రలూ పార్ట్ 2 లో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలవనున్నారని తెలిపారు. దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ జరుగుతుందట.

kalki 2898 ad part 2 shoot going silently these three will be big highlight

ప్రభాస్ లేని పలు కీలక సన్నివేశాలు కల్కి చిత్ర యూనిట్ చేసేస్తున్నారట. ఆల్రెడీ పలు భారీ సెట్టింగ్స్ ఉన్నాయని ఇలా వాటిలో చేసేస్తున్నట్టుగా సమాచారం. ఇంకా సినిమా రిలీజ్ కూడా అన్నీ సహకరిస్తే వచ్చే ఏడాది 2026లో ఉండొచ్చని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

సో మొత్తానికి ఈ అవైటెడ్ సీక్వెల్ ని మాత్రం మేకర్స్ పక్కా ప్లానింగ్ గా ఇండియా వైడ్ ఆడియెన్స్ కి ఫీస్ట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నారని చెప్పాలి. ఇక ఇవి పక్కన పడితే పార్ట్ 2 లో జాయిన్ అయ్యేందుకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ లేట్ గా జాయిన్ కానుంది. ప్రస్తుతం ఈమె తనకి ఇటీవల పుట్టిన బిడ్డతో కొంచెం ఎక్కువ సమయం గడపాలని చూస్తుంది. అందుకే కొంచెం సమయం తీసుకొని కల్కి సెట్స్ లో జాయింగ్ కానుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X