ఆంధ్ర ప్రదేశ్‌లో 175 సీట్లకు 160 కూటమి గెలుస్తుంది.. ప్రముఖ నిర్మాత జోస్యం
ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకొన్నది. దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం ముగిస్తున్న నేపథ్యంలో ఇండియావైడ్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. అయితే గత రెండు వారాల క్రితం ముగిసిన ఎన్నికల తర్వాత రకరకాల సర్వేలు, ఎన్నికల పోలింగ్ సరళి, ఓటు హక్కు వినియోగించుకొన్న తీరుపై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమదే విజమయమని పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వీడియోను రిలీజ్ చేసి చెప్పిన జోస్యం వైరల్ అవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అయితే గతంలో అశ్వినీదత్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. అయితే విజయవాడ లోక్‌సభకు పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత పాలిటిక్స్ నుంచి తప్పుకొన్నారు.

అయితే అశ్వినీదత్ మాత్రం తనకు అత్యంత ఆప్తుడు, అభిమాన నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. కానీ తన నైతిక మద్దతునే ఇస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.

తాజాగా వీడియోను రిలీజ్ చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో మొత్తం 160 సీట్లను తెలుగుదేశం పార్టీ తరఫున కచ్చితంగా చంద్రబాబు గెలుచుకొంటారు అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.
ఇదిలా ఉండగా, తన సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భాన్ని పురస్కరించుకొని.. పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏఢీ అనే సినిమాను సుమారుగా 600 కోట్ల రూపాయలతో రూపొందించారు. ప్రభాస్, దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం జూన్ 27వ తేదీన రిలీజ్ కాబోతున్నది.


Click it and Unblock the Notifications











