4 ఏళ్ల కఠోర శ్రమ..600 కోట్ల బడ్జెట్.. మా లైఫ్‌తో ఆడుకోవద్దు.. వైజయంతీ మూవీస్ సంచలన ట్వీట్
తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న ప్రముఖ నిర్మాత సంస్థ వైజయంతీ మూవీస్ తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. నాలుగేళ్ల ప్రయాణం ఇది. కఠోరమైన హర్డ్ వర్క్‌కు సంబంధించిన కథ ఇది. నాగ్ అశ్విన్, ఆయన టీమ్ కష్టపడి మీ ముందు కల్కి 2898 ఏడీ సినిమాను పెడుతున్నారు అని తెలిపారు.
కల్కిని హాలీవుడ్, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రేక్షకులకు అందించడానికి ఎలాంటి రాజీ పడలేదు. క్వాలిటి విషయంలో కూడా ఖర్చుకు వెనుకాడలేదు. ఈ నాలుగేళ్లు రక్తాన్ని చెమటగా మార్చి ఈ కథను విజువల్ వండర్‌గా మార్చాం అని ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ సినిమా వెనుక ఇంత శ్రమ ఉన్నది. అందుకే ఈ సినిమాను గౌరవించండి. మా సాంకేతిక నిపుణుల ప్రతిభను రెస్పెక్ట్ చేయండి. ఈ సందర్భంగా మీకు ఒకటే రిక్వెస్ట్. ఈ సినిమాకు సంబంధించిన ట్విస్టులు లీక్ చేయకండి.. నిమిష నిమిషానికి సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇవ్వకండి. అలాగే వీడియోలు తీసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని దూరం చేయకండి అని వేడుకొన్నారు.
కల్కి సినిమా కంటెంట్‌ను సురక్షితంగా ప్రేక్షకులకు అందించడానికి మాతో సహకరించండి. మనమంతా కలిసి సినిమాను సెలబ్రేట్ చేసుకొందాం. మా అభ్యర్థను, రిక్వెస్ట్‌ను అర్దం చేసుకొంటారని అనుకొంటున్నాం అని వైజయంతీ మూవీస్ తమ ప్రకటనలో పేర్కొన్నది. ఈ సినిమా కొద్ది సేపట్లో ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











