9 ఏళ్ల వయసులోనే సెక్స్: వేదన పడ్డానన్న హీరోయిన్
హైదరాబాద్: తొమ్మిదేళ్ల వయసులోనే సెక్సువల్ వేధింపులకు గురయ్యానని బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ చెప్పుకొచ్చారు. ఆ వయసులో నాతో సెక్స్ చేయడానికి ఒకర్ని అనుమతించాను. అప్పుడు సెక్స్ అంటే ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలీదు. ఇంట్లో తెలుస్తుందని భయ పడ్డాను. ఆ విషయాన్ని మా అమ్మానాన్నలతో చెప్పాలనే అవగాహన కానీ, స్థైర్యం కానీ నాకున్నట్లయితే సంవత్సరాల తరబడి వేదన అనుభవించి ఉండేదాన్ని కాదు'' కల్కి తెలిపారు.

సెక్స్ గురించి స్వేచ్ఛగా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పిల్లలు భయపడకూడని వాతావరణం ఉండాలని కల్కి అభిప్రాయ పడింది. ‘నా జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పడానికి కారణం అంతా సానుభూతి చూపాలని కాదు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న మరికొందరికి మాట్లాడే ఆత్మస్థైర్యం ఇవ్వాలనే ఇదంతా చెబుతున్నాను' అన్నారు. సెక్స్‌పై పిల్లల్లో అవగాహన కలిగించడం ద్వారా బయటకు చెప్పుకోలేని ఇలాంటి లైంగిక వేధింపుల నుంచి వాళ్లను కాపాడవచ్చన్నారు.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దేవ్ డి' చిత్రం ద్వారా పాండిచ్చేరికి చెందిన ఈ ఫ్రెంచి సంతతి భామ సినిమా రంగంలో అడుగు పెట్టింది. అలా అనురాగ్ కశ్యప్‌తో ఏర్పడిన పరిచయం కాస్త కల్కి కోచ్లిన్ అతన్ని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. రెండేళ్ల కాపురం తర్వాత అనురాగ్ కశ్యప్-కల్కి కోచ్లిన్ విడిపోయారు.


Click it and Unblock the Notifications











