హీరోపై దాడిచేసి పెదాల్ని కొరికిన హీరోయిన్...!
ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. బాలీవుడ్లో అయితే అసలు లిప్ లాక్ లేని సినిమానే లేదంటే అతిశయోక్తి కాదేమో. హీరో హీరోయిన్ల కూడా ఇలాంటి సీన్లు చేయడానికి ఎలాంటి అభ్యంతరం తెలుపడం లేదు. ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్లే ఉన్నాయి...రొటీన్ అనుకున్నారో ఏమో...తాజాగా షాంఘై అనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ హీరో పెదాలను కొరికే సీన్ పెట్టారు.
బాలీవుడ్ నటి కల్కి, బెంగాలీ యాక్టర్ ప్రొసెన్జిత్ చటర్జీ మధ్య ఈ సీన్ ప్లాన్ చేశారు. షాంఘై చిత్ర దర్శకుడు దిబాకర్ చటర్జీ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ....''కల్కి ఈ చిత్రంలో ఇండియన్ గర్ల్‌గా నటిస్తోంది. మిక్స్‌డ్ పేరెంట్స్‌కు పుట్టిన అమ్మాయి కాబట్టి ఫారనర్‌లా కనిపిస్తుంది. ప్రొసెన్జిత్ ఈ చిత్రంలో సోషల్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. కల్కి కంటే ప్రొసెన్జిత్ వయసు ఎక్కువ పాత్రలో నటించాడు. వీరిద్దరి మధ్య సెక్సువల్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
వీరిద్దరి మధ్య కిచెన్‌లో ఓ రొమాంటిక్ సీన్ ప్లాన్ చేశాం. ఈ సన్ని వేశంలో కల్కి ప్రొసెన్జిత్‌పై దాడి చేసి అతని పెదాల్ని కొరకాల్సిన ఉంటుంది. సీన్ బాగా వచ్చింది. కల్కి మంచి నటి కానీ ఆమె ఇంకా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. మేం చెప్పేది ఆమె నటన విషయంలో కాదు, లిప్ లాక్ సీన్ల విషయంలో ఆమె మరిన్ని మెలకువలు నేర్చుకోవాలి'' అని దర్శకుడు చెప్పారు.
షాంఘై చిత్రంలో అభయ్ డియోల్, ప్రొసెన్జిత్ సేన్, ఇమ్రాన్ హస్మి, కల్కి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశాల్- శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జూన్ 8వ తేదీన ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











