దర్శకుడి భార్య ఉన్నట్టుండి ఇలా... బికినీలో హట్‌గా!(ఫోటో)
హైదరాబాద్: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్య కశ్యప్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేక పోయినా.... క్యాట్‌బరీ డెయిరీ మిల్క్ షాట్స్ తెలుగు యాడ్లో ఏంబాబూ లడ్డూ కావాలా? అంటూ దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. బొంబాయి బాంబు పేలుళ్లు గూర్చి తీసిన బాలీవుడ్ మూవీ 'బ్లాక్ ఫ్రైడే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్, దాని తరువాత నో స్మోకింగ్, దేవ్ D మరియు గులాల్ చిత్రాలకు పేరుపొందారు.
ఆయన సినిమాల సంగతి పక్కన పెడితే... మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కల్కి కోచ్లిన్‌ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దేవ్ డి' చిత్రం ద్వారా పాండిచ్చేరికి చెందిన ఈ ఫ్రెంచి సంతతి భామ సినిమా రంగంలో అడుగు పెట్టింది. అలా అనురాగ్ కశ్యప్‌తో ఏర్పడిన పరిచయం కాస్త కల్కి కోచ్లిన్ అతన్ని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.
కల్కి కోచ్లిన్ కేవలం అనురాగ్ కశ్యప్‌కు భార్యగానే కాదు, అతనితో పాటు కలిసి పని చేస్తూ సహాయ పడుతూ ఉంటుంది. కశ్యప్‌తో పెళ్లి తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు పెరిగాయి. ఆమధ్య ఆమె హృతిక్-కత్రినా కలిసి నటించిన 'జిందగీ నమిలేగా దుబారా' చిత్రంలోనటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కూడా. తాజాగా తన అందచందాలను కూడా బయట పెట్టడం మొదలు పెట్టింది. ఉన్నట్టుండి ఇలా బికీనీలో ఫోటోకు ఫోజులు ఇచ్చి తనకూ సెక్సీ పర్సనాలిటీ ఉందని చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అంతే మరి! గ్లామర్ ఫీల్డ్‌లో అడుగు పెట్టాక తన అందాలు అందరూ చూడాలనే తాపత్రయం కామనే...'


Click it and Unblock the Notifications












