Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విడాకుల తర్వాత సెక్సీగా రెచ్చిపోతోంది (ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్య కశ్యప్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేక పోయినా.... క్యాట్బరీ డెయిరీ మిల్క్ షాట్స్ తెలుగు యాడ్స్‌లో ఏం బాబూ లడ్డూ కావాలా? అనే ప్రకటలో కనిపించిన వ్యక్తి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. బొంబాయి బాంబు పేలుళ్లు గూర్చి తీసిన బాలీవుడ్ మూవీ 'బ్లాక్ ఫ్రైడే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్, దాని తరువాత నో స్మోకింగ్, దేవ్ D మరియు గులాల్ చిత్రాలకు పేరుపొందారు.
ఆయన సినిమాల సంగతి పక్కన పెడితే... మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కల్కి కోచ్లిన్‌ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దేవ్ డి' చిత్రం ద్వారా పాండిచ్చేరికి చెందిన ఈ ఫ్రెంచి సంతతి భామ సినిమా రంగంలో అడుగు పెట్టింది. అలా అనురాగ్ కశ్యప్‌తో ఏర్పడిన పరిచయం కాస్త కల్కి కోచ్లిన్ అతన్ని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.
రెండేళ్ల కాపురం తర్వాత అనురాగ్ కశ్యప్-కల్కి కోచ్లిన్ విడిపోయారు. భర్తతో కలిసున్నపుడు కూడా కల్కి కోచ్లిన్ సినిమాల్లో నటించింది. అయితే విడాకుల తర్వాత ఆమె తన హాట్ అండ్ సెక్సీ ఆటిట్యూడ్‌తో దూకుడుగా ముందుకు సాగుతోంది. తాజాగా మాగ్జిమ్ అనే పురుషుల మేగజైన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది.
ఫెంచి సంతతి భామ
కల్కి కోచ్లిన్ ఫ్రెంచి సంతతి భామ. ఆమె తండ్రి జియోల్ కోచ్లిన్ 40 ఏళ్ల క్రితమే ఫ్రాన్స్ నుండి ఇండియా వచ్చారు. ఇక్కడి శ్రీ అరబిందో ఆశ్రమంలో ఫ్రాన్కోయిస్ ఆర్మాండ్లేను కలిసారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ శ్రీ అరబిందో భక్తులు. ఊటి సమీపంలోని కల్లట్టీ అనే గ్రామంలో సెటిలయ్యారు. వీరి సంతానమే కల్కి కోచ్లిన్.
సినిమాలపై ఆసక్తితో ముంబైకి...
కల్కి కోచ్లిన్ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో డ్రామా, థియేటర్ ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. సినిమాలపై ఆసక్తితో ముంబై చేరుకుంది.
టెలివిజన్ కమర్షియల్స్‌కు...
కెరీర్ ప్రారంభంలో కల్కి కోచ్లిన్ టెలివిజన్ కమర్షియల్ కోసం మోడలింగ్ అసైన్మెంట్ష్ చేసింది.
దేవ్ డి సినిమాతో...
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవ్ డి' చిత్రంతో కల్కి కోచ్లిన్ సిని రంగ ప్రవేశం చేసింది.
గుర్తింపు తెచ్చిన సినిమాలు
జిందగీ న మిలేగీ దుబారా, యే జవానీ హై దివానీ చిత్రాలు కల్కి కోచ్లిన్కు మంచి గుర్తింపు తెచ్చాయి.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
ప్రస్తుతం కల్కి కోచ్లిన్ హ్యాపీ ఎండింగ్, మార్గరితా విత్ ఎ స్ట్రా, జియా ఔర్ ఝా, సెవెరింగ్ టైస్....