చిన్నతనంలోనే చిదిమేసారు, ఆ హీరోయిన్‌కు సెక్సువల్ వేధింపు!

By Bojja Kumar

హైదరాబాద్: హిందీ నటి, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కొచ్లిన్ ఇటీవల మీడియాతో తన జీవితంలో జరిగిన ఓ చీకటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను మాత్రమే కాదని ఇండియాలో 53 శాతం మంది చిన్నారులు చిన్నతనంలో సెక్సువల్ వేధింపులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు.

కల్కి కోచ్లిన్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే...అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దేవ్ డి' చిత్రం ద్వారా పాండిచ్చేరికి చెందిన ఈ ఫ్రెంచి సంతతి భామ సినిమా రంగంలో అడుగు పెట్టింది. అలా అనురాగ్ కశ్యప్‌తో ఏర్పడిన పరిచయం కాస్త కల్కి కోచ్లిన్‌ అతన్ని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.

Kalki Koechlin on being abused as a child

అనురాగ్ కశ్యప్ తన మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కల్కి కోచ్లిన్‌ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. 2013లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. కశ్యప్‌తో పెళ్లి తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు పెరిగాయని చెప్పక తప్పదు. ఆమధ్య ఆమె హృతిక్-కత్రినా కలిసి నటించిన 'జిందగీ నమిలేగా దుబారా' చిత్రంలోనటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవల రణబీర్ కపూర్, దీపిక పదుకొనె జంటగా వచ్చిన 'యే జవాని హై దివానీ' చిత్రంలో కూడా కల్కి పోషించిన పాత్ర ప్రశంసలు అందుకుంది. నాలుగు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అందులో 'మార్గారితా విత్ ఎ స్ట్రా, హ్యాపీ ఎండింగ్, జియా ఔర్ ఝా, సెవెరింగ్ టై' అనే చిత్రాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X