కల్కీ మూవీ ప్రీ రివ్యూ: రాజశేఖర్ పోలీస్‌గా యాటిట్యూడ్ ఎలా ఉందంటే.. (ఫస్ట్ రిపోర్ట్)
Recommended Video
గురుడ వేగ హిట్ తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ జోరు పెంచారు. అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి పోలీస్ కథతో ముందుకొచ్చాడు. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది. ఈ నేపథ్యంలో కల్కి సినిమా గురించి మరినీ విశేషాలు.

1983 నేపథ్యంతో కథ
1983 నేపథ్యంలో కథ సాగే కథ కల్కి. పీరియడ్ సినిమాల కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కథతో కల్కి తెరకెక్కింది. కల్కి కోసం పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసినట్టు టీమ్ చెప్పింది. అన్ని కమర్షియల్ హంగులతో కల్కి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

హీరో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్
కల్కి పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ హైలైట్ అయ్యాయనే మాట వినిపిస్తున్నది. 'గరుడవేగ' తర్వాత 'కల్కి'లో చేసిన సున్నితమైన హాస్యానికి ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. పోలీస్ పాత్రలో మరోసారి విజృంభించినట్టు సమాచారం. రాజశేఖర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందనే మాట వినిపిస్తున్నది. కల్కితో మరో హిట్ ఖాయమనే మాట ఫస్ట్ డే ఫస్ట్ షోలో వ్యక్తమవుతున్నది.

గ్లామర్ హీరోయిన్లతో మరింతగా
అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ గ్లామర్ హీరోయిన్లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. కల్కి సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. థియేటర్‌లో లాస్ట్ రీల్ వరకూ ప్రేక్షకులు ఆసక్తిగా చూసే విధంగా, అంత క్యూరియాసిటీ రేపే విధంగా సన్నివేశాలు ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. టెక్నికల్ వేల్యూస్‌తో, హై బడ్జెట్‌తో తీసిన చిత్రం పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు.

కామెడీ, ఐటమ్ పాటలతో
కమర్షియల్ ట్రైలర్ విడుదలైన తర్వాత చాలామంది ‘కల్కి'ని ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్'తో కంపేర్ చేయడం జరుగుతున్నది. సినిమాలో కామెడీ, ఐటమ్ సాంగ్, కమర్షియల్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరినట్టు సమాచారం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కమర్షియల్ ట్రైలర్ కట్ చేయడంతో విపరీతమైన బజ్ వచ్చింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
సాంకేతిక వర్గం:
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర,
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,
స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్,
ఆర్ట్: నాగేంద్ర,
ఎడిటర్: గౌతమ్ నెరుసు,
స్టిల్స్: మూర్తి,
లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె),
కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్,
ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు,
ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు,
చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి,
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి,
పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి,
సమర్పణ: శివాని, శివాత్మిక,
నిర్మాత: సి.కళ్యాణ్,
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.


Click it and Unblock the Notifications











