బాలయ్య ‘కల్కి’.. దేవుడు మాదిరి కాదంట!

By Bojja Kumar

నందమూరి నట సింహం బాలకృష్ణ-పార్వతి మెల్టన్ జంటగా.....రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'కల్కి' అనే టైటిల్ ఖరారు చేసే యోచచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 'కల్కి' అనే టైటిల్ పై జనాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. కొంత మంది ఈ సినిమాను 'దేవుడు'కు లింకెట్టి మాట్లాడుతున్నారు. దీంతో ఆ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు అభిమానులు . కల్కి అంటే బ్రతికి ఉన్న దేవుడుగా చెప్పుకుంటున్న స్వామిజీ కాదని స్పష్టం చేస్తున్నారు.

కల్కి అంటే తనను తాను అందంగా మలుచుకునే శిల్పమని, కల్కి అనే పదం వెనక మహోన్నతమైన తాత్పర్యం ఉందని, ఒక మనషి ఇతరుల సహాయం లేకుండా తనను తాను మార్చుకున్నప్పుడే గొప్పవాడవుతాడని అంటున్నారు. అదే విధంగా బాలకృష్ణ హీరోగా గతంలో వచ్చిన ప్లాపు సినిమా 'దేవుడు' మాదిరి కాకుండా...ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించే యోచనలో ఉన్నారని మరికొందరు అంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ పరుచూరి మురళి దర్శకత్వంలో 'అధినాయకుడు' చిత్రంలో నటిస్తున్నాడు. బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని నటిస్తున్నారు. ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X