Kaloji Biopic వెండితెరపై ప్రజాకవి కాళోజీ జీవితం.. దర్శకుడు ఎవరు? రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితాన్ని వెండితెరపై దర్శకులు ప్రభాకర్ జైనీ ఆవిష్కరిస్తున్నారు. ప్రజాకవి కాళోజీ చిత్రాన్ని జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. టైటిల్ పాత్రలో, కాళోజీగా మూలవిరాట్ నటించారు. కాళోజీ నారాయణరావు భార్యగా పద్మ, కొడుకుగా రాజ్ కుమార్, కోడలుగా స్వప్న నటించారు. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు వెల్లడిస్తూ..

ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ చిత్రీకరణ చేసేటప్పుడు మూలవిరాట్‌ను చూసి నిజంగా కాళోజీ గారు వచ్చినట్లు ఉందని చాలా మంది చెప్పారు. పోలికలు అంతలా అచ్చుగుద్దినట్లు ఉంటాయి. కాళోజీ గారి కుటుంబ సభ్యులతో పాటు చూసిన వారంతా కాళోజీయే బ్రతికి వచ్చి తమ కళ్ళ ముందు నడయాడుతున్నట్టుగా ఫీలయ్యారు. మేం ఈ సినిమాను కాళోజీ గారు జీవించిన, ఆయన తిరిగిన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం అని ప్రభాకర్ జైనీ తెలిపారు.

Kaloji Biopic Praja Kavi Kaloji is set Release on September 9th

వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. విశాఖలో ఓ సన్నివేశం చేశాం. శ్రీ శ్రీ, కాళోజీ, రామేశ్వరరావు కలిసి ఉన్న దృశ్యాలు, విశాఖలో కృష్ణబాయమ్మ గారి ఇంట్లో కాళోజీ ఉన్న దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి. అమృతలత గారి ఇంటిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ఆయన నివసించిన ఇంట్లోనే సన్నివేశాలు తీశాం. కాళోజీ గారు వాడిన కళ్ళజోడు, చేతి కర్రను ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో ఉపయోగించాం అని ప్రభాకర్ జైనీ తెలిపార.

కాళోజీ జీవితం ఒక అనంత ప్రయాణం. ఆయనకు రెండు రాష్ట్రాల్లో అనేక మంది మిత్రులు ఉన్నారు. వారి జీవిత చరిత్ర చదువుతుంటే, వారి సన్నిహిత మిత్రులు నుంచి వింటుంటే, పది సినిమాలకు సరిపడినంత కంటెంట్ లభించింది. దానిని ఒక సినిమా పరిధిలోకి కుదించడం, దాదాపు అసాధ్యం. అందుకే, కాళోజీ ఔన్నత్యాన్ని, కాళోజీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుని... వారి జీవితం స్ఫూర్తి పొంది, కథ రాసుకున్నాను అని ప్రభాకర్ జైనీ చెప్పారు.

కాళోజీ జీవితం మూవీని సెప్టెంబర్ 9న సినిమా విడుదల చేయాలని శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. ప్రేక్షకుల అంచనాల మేరకు సినిమా వస్తుందని, భగవంతుని ఆశీస్సులతో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను అని ప్రభాకర్ జైనీ చెప్పారు. ఈ చిత్రంలో ముఖ్యంగా నాలుగు పాటలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే గోరటి వెంకన్న, రెండు వందేమాతరం శ్రీనివాస్, ఒకటి మాళవిక, భూదేవి పాడారు. ఈ పాటలలో కాళోజీ కవితల సారాంశాన్ని పొందు పరిచాము. పాటలు ఈ సినిమాకు ఒక ఔన్నత్యాన్ని ఆపాదిస్తాయి అని చెప్పారు.

Kaloji Biopic Praja Kavi Kaloji is set Release on September 9th

కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్ తదితరులు ఈ సినిమాలో వారి పాత్రల్లో నటించారు. పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు నటించారు. ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్ వంటి అనేక మంది నూతన, స్థానిక నటీనటులు ఇతర పాత్రల్లో నటించారు. జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు.

సాంకేతిక నిపుణుల గురించి
ఎడిటింగ్: రవి కుమార్,
కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల,
పాటలు: బిక్కి కృష్ణ,
సంగీతం: యస్.యస్ ఆత్రేయ,
బ్యానర్: జైనీ క్రియేషన్స్,
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ
పీఆర్వో: పులగం చిన్నారాయణ
రిలీజ్ డేట్: 2023-09-09

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X