మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ నెక్ట్స్ మూవీ ఖరారు, వివరాలు ఇవే..
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లాడిన కళ్యాణ్ దేవ్.... ఆ మధ్య 'విజేత' అనే సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే కళ్యాణ్ దేవ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'విజేత' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.
'విజేత' సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతడు నటించబోయే సెకండ్ మూవీ ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థపై ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

కళ్యాణ్ దేవ్ మూవీ
కళ్యాణ్ దేవ్ నటించబోయే ఈ రెండో చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహించబోతున్నారు. ఇంతకు ముందు ‘నాటకం' అనే చిత్రాన్ని తెరకెక్కించిన రిజ్వాన్ ఎంటర్టెన్మెంట్స్ వారు ప్రొడక్షన్ నెం.2గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఎస్ఎస్ థమన్ సంగీతం
కళ్యాణ్ దేవ్ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందించబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మామయ్య చిరు సూచన మేరకు
తొలి సినిమా ‘విజేత' బాక్సాఫీసు వద్ద నిరాశ పరచడంతో చిరంజీవి తన అల్లుడికి కొన్ని సూచనలు చేశారట. రెండవ చిత్రం విషయంలో తొందర పడకుండా కథ ఎంపిక విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని, డాన్స్, నటనపై మరింత ఫోకస్ పెట్టాలని తెలిపారు. మామయ్య సూచన మేరకే కళ్యాణ్ దేవ్ మంచి కథ కోసం ఎదురు చూసి ఎట్టకేలకు ఫైనల్ చేశారు.

త్వరలో పూర్తి వివరాలు
నటీనటులు: కల్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: పులి వాసు
నిర్మాత: రిజ్వాన్
బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి)
సంగీతం: ఎస్ఎస్ తమన్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
సహ దర్శకులు: డి. రాజేంద్ర, రవి
సాహిత్యం: కేకే
ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు

తండ్రి కాబోతున్న కళ్యాణ్ దేవ్
కళ్యాణ్ దేవ్-శ్రీజ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవలే కొణిదెల కుటుంబం శ్రీజకు గ్రాండ్‌గా శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వ్యవహారాలన్నీ రామ్ చరణ్ భార్య ఉపాసన దగ్గరుండి చూసుకున్నారు. రోటీన్‌గా తెలుగు స్టైల్‌లో శ్రీమంతంలా కాకుండా ఫారిన్ స్టైల్‌లో 'బేబీ షవర్' పార్టీ నిర్వహించారు.


Click it and Unblock the Notifications











