మెగా డాటర్‌కి దూరమైన అల్లుడు కళ్యాణ్ దేవ్.. ఆ గోల ముగిసే వరకు గ్యాప్ తప్పదు!
మెగా ఫ్యామిలీ గురించి అభిమానులకు పెద్దగా తెలియని విషయాలు ఉండవు. దాదాపు అన్ని వివాదాల గురించి అలాగే వారి బంధాల గురించి అందరికి తెలిసినవే. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా సైలెంట్ గా స్మైల్ తో వెళ్లిపోవడం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యమైంది. ఇక ఇటీవల ఆయన రెండో కూతురు శ్రీజకు భర్త కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నారని తెలిసింది.

సొంత ఇంట్లోనే..
సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే కామెంట్స్ కి అలాగే సినిమాల అప్డేట్స్ పై ఎదో ఒక రూమర్ క్రియేట్ అవ్వడం సాధారణం. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ భర్తకు అలాగే తన కూతురికి దూరంగా ఉండడం కూడా హాట్ టాపిక్ మారింది. సొంత ఇంట్లోనే కుటుంబానికి దూరంగా ఎందుకు ఉన్నారనే విషయంపై అనేక సందేహాలు వచ్చాయి.

అందుకే దూరంగా ఉంటున్నాడట..
ఈ విజయంపై కళ్యాణ్ దేవ్ ముందుగానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కరోనా భయం వల్ల ఇంట్లో వాళ్లకు చాలా దూరంగా ఉండాల్సి వస్తోందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఉదయం బయటకు వెళితే సాయంత్రం ఎప్పుడో గాని బయటకు రాను అందుకే వారికి దూరంగా ఉంటున్నట్లు కళ్యాణ్ చెప్పాడు..

షూటింగ్ కోసమే..
ఇటీవల కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీలో అంధరికంటే ముందే.. తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేయగానే కళ్యాణ్ సూపర్ మచి షూటింగ్ లో వేగాన్ని పెంచాడు. వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేయాలని కళ్యాణ్ ఒక టార్గెట్ పెట్టుకున్నాడట. అందుకే కరోనా ఉన్నా కూడా లెక్క చేయడం లేదట.
Recommended Video

ఆ పనులు నేనే చేసుకుంటున్నా..
ఇక భార్య శ్రీజకు అలాగే తన కూతురిని ఏ మాత్రం కలవకుండా తన ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నాడట. షూటింగ్స్ ఉన్నన్ని రోజులు సొంతంగా తనకు తానే క్వారంటైన్ లో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వేసుకున్న బట్టలను ప్రతిరోజు తనే వాష్ చేసుకుంటున్నాడట. తన ఫ్యామిలీని రిస్క్ లో పెట్టడం కంటే ఇది పెద్ద కష్టమేమీ కాదని కళ్యాణ్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











