రంగంలోకి చిరంజీవి అల్లుడు.. అంతా సెట్! ఇక అదే తరువాయి

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తిరిగి రంగంలోకి దిగుతున్నాడు. విజేత సినిమాతో సినీ గడప తొక్కిన ఈ హీరో.. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశారు. మరి కళ్యాణ్ దేవ్ రెండో సినిమా తాలూకు వివరాలు చూద్దామా..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో పెళ్లి.. విజేత

చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో పెళ్లి.. విజేత

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో పెళ్లి జరిగిన తర్వాత సినీ రంగంలోకి వచ్చిన కళ్యాణ్ దేవ్.. మెగా కాంపౌండ్ హీరోగా విజేత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా ఒక మంచి సినిమా అనిపించుకుంది. ఇందులో కళ్యాణ్ దేవ్ నటనకు మెగా అభిమానులు అట్రాక్ట్ అయ్యారు.

సెకండ్ ప్రాజెక్టుకు రెడీ.. నయా దర్శకుడు

సెకండ్ ప్రాజెక్టుకు రెడీ.. నయా దర్శకుడు

తొలి సినిమా విడుదలయ్యాక చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్.. ఇప్పుడు తన రెండో చిత్రాన్ని ప్రకటించారు. మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. అంతేకాదు, ఈ సినిమా ద్వారా శ్రీధర్ సీపాన అనే రచయిత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

భారీ మూవీ.. ముగ్గురు నిర్మాతలు

భారీ మూవీ.. ముగ్గురు నిర్మాతలు

జీఏ2 పిక్చర్స్ కళ్యాణ్ దేవ్ రెండో సినిమాను సమర్పిస్తోంది. ఇటీవలే ‘వెంకీ మామ'తో విజయాన్ని అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. చిత్రాన్ని సర్వహంగులతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట.

దర్శకుడి అవతారమెత్తుతున్న రచయిత

దర్శకుడి అవతారమెత్తుతున్న రచయిత

ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీధర్ సీపాన గతంలో ‘నమో వెంక టేశ', ‘దూకుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు. అలాగే.. ''అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం, సౌఖ్యం, డిక్టేటర్ లాంటి చిత్రాలకు కథ, మాటలు రచించారు. ఇప్పుడు ఈయన మెగా ఫోన్ పట్టనుండటం ఆసక్తికర అంశం.

వినోదభరిత కుటుంబ కథా చిత్రం.. అంతా సెట్

వినోదభరిత కుటుంబ కథా చిత్రం.. అంతా సెట్

ఈ మేరకు ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నానని, ఈ కథకు హీరోగా కళ్యాణ్ దేవ్ అయితే సరిగ్గా సరిపోతారని అనిపించిందని శ్రీధర్ సీపాన అన్నాడు. ప్రేమకథతో కూడిన వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపాడు. మార్చిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X