డబ్బింగ్ పనులు ప్రారంభించిన మెగాస్టార్ అల్లుడు!
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది. కళ్యాణ్ దేవ్ కు జోడీగా మాళవిక నాయర్ ఈ సినిమాలో నటిస్తోంది.
తాజాగా చిత్ర హీరో కళ్యాణ్ దేవ్ ఈ సినిమాకు సంభందించిన డబ్బింగ్ పనులు ప్రారంభం చేసారు. తన పాత్రకు డబ్బింగ్ స్టార్ట్ చేసాడు హీరో కళ్యాణ్ దేవ్. "బాహుబలి" సినిమా కెమెరా మెన్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. "రంగస్థలం" ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు.

తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











