నాగ్ నాకు దేవుడు, వాడుకోకుండా వదలడు.. ఆయన పవర్ ఆకాశమంత.. కళ్యాణ్ కృష్ణ!

Recommended Video

Pawan Kalyan Speech At Nela Ticket

సోగ్గాడే చిన్ని నాయనాతో దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ తొలి ప్రయత్నంలో ఘనవిజయం అందుకున్నాడు. ఆ తరువాత చేసిన రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం నేల టిక్కెట్టు. మాస్ మహా రాజా రవితేజ హీరోగా, డెబ్యూ హీరోయిన్ మాళవిక శర్మ జంటగా ఈ చిత్రం తెరక్కుతోంది. గురువారం ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఫిదా ఫేమ్ శక్తి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాగ్ నాకు దేవుడు

నాగ్ నాకు దేవుడు

ఆడియో వేడుకలో తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునని కళ్యాణ్ కృష్ణ గుర్తు చేసుకున్నారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తారని, నాకు నాగార్జున దేవుడు అని కళ్యాణ్ కృష్ణ తెలిపాడు.

హరీష్ శంకర్ ద్వారా

హరీష్ శంకర్ ద్వారా

తాను దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నపుడు హరీష్ శంకర్ ద్వారా రవితేజని కలిసి నేల టిక్కెట్టు కథ చెప్పానని అన్నారు. తప్పకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిర్మాత రామ్ తాళ్లూరి రవితేజపై ఉన్న నమ్మకంతో కథ వినకుండా ఈ చిత్రానికి అంగీకరించారని అందుకు వారికి కృతజ్ఞతలు అని కళ్యాణ్ కృష్ణ తెలిపారు.

ఆయన సపోర్ట్‌తోనే

ఆయన సపోర్ట్‌తోనే

తాను తొలి చిత్రం రవితేజతో చేయలేదు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వలనే అవకాశాలు వచ్చే వరకు పోరాడగలిగానని కళ్యాణ్ కృష్ణ తెలిపాడు.

వాడుకోకుండా వదలడు

వాడుకోకుండా వదలడు

ముఖ్య అతిధిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ గురించి కళ్యాణ్ కృష్ణ మాట్లాడాడు. దేవుడు ఎవరికైనా పవర్ ఇచ్చాడంటే దానిని వాడుకోకుండా వదలదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పవర్ ఆకాశమంత అని కళ్యాణ్ కృష్ణ అభిప్రాయ పడ్డాడు. అంటే ఆయన నుంచి దేవుడు చాలా ఆశిస్తున్నాడని, మేము కూడా ఆశిస్తున్నామని కళ్యాణ్ కృష్ణ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేసాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X