తారక్ నీ నమ్మకమే నిజం.. ఎవరూ చూడనప్పుడు చూశావు... ఆ సినిమా ఫ్లాప్ అయితే.. కల్యాణ్ రామ్

Recommended Video

Kalyan Ram Praising NTR In 118 Success Meet || Filmibeat Telugu

కల్యాణ రామ్, నివేదా థామస్, షాలిని పాండే నటించిన 118 చిత్రం విజయపథంలో దూసుకెళ్తున్న సమయంలో చిత్రయూనిట్ శనివారం (మార్చి 16) రోజున హైదరాబాద్ ఆవాసా హోటల్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరోయిన్లు షాలిని పాండే, నివేదా థామస్, దర్శకుడు కేవీ గుహన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..

 ఓ గట్ ఫిలింగ్‌తో చేశాను

ఓ గట్ ఫిలింగ్‌తో చేశాను

118 సినిమా విజయానికి సహకారం అందించిన మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు. ఈ సినిమా ఆడకపోతే నేను చాలా నిరాశపడేవాడినేమో. ఈ సినిమాను అంగీకరించకపోతే తప్పు చేశాననే ఫీలింగ్ కలిగేదేమో. కొత్త రకంగా కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారనే చిన్న గట్ ఫీలింగ్‌తో చేశాను. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టినందుకు థ్యాంక్స్ అని కల్యాణ్ రామ్ అన్నారు.

 కేవీ గుహన్ లేకపోతే 118 లేదు

కేవీ గుహన్ లేకపోతే 118 లేదు

కేవీ గుహన్ లేకపోతే 118 సినిమా లేదు. నాలో ఏం చూసి నమ్మారో నాకు ఇప్పటికీ తెలియదు. దర్శకుడిగా గుహన్ మెయిన్ పిల్లర్. ఆయన ఈ స్క్రిప్టు తీసుకురాకపోతే నా కెరీర్‌లో ఏదో మిస్సయ్యే వాడిని అని కల్యాణ్ పేర్కొన్నారు.

నా నువ్వే ఫ్లాప్ అయినప్పుడు

నా నువ్వే ఫ్లాప్ అయినప్పుడు

నిర్మాత మహేష్ కోనేరు ముఖంలో నవ్వు చూశాను. చాలా సంతోషంగా ఉంది. నా నువ్వే సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధపడ్డారు. నీ వద్దకు వచ్చి నేనేదో మంచి చేద్దామని అనుకొన్నాను. కానీ ఫలితం మరోలా ఉందని అన్నాడు. అందుకు నేను మన చేతిలో ఏమి ఉండదని నేను అండగా నిలిచాను.

 నివేదా థామస్ ఒప్పుకోకపోతే

నివేదా థామస్ ఒప్పుకోకపోతే

118 సినిమాకు నివేదా థామస్ వెన్నముక. ఆమె ఈ సినిమాను ఒప్పుకోవడం నిజంగా థ్యాంక్స్. మీరు ఒప్పుకోకపోతే మరొక హీరోయిన్ ఎవరనేది ఊహించుకోవడానికి కూడా కష్టమే. ఈ సినిమాలో అద్బుతంగా తన పాత్రను పోషించింది. షాలిని సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది అని కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

 తారక్ నమ్మకం నిజమైంది

తారక్ నమ్మకం నిజమైంది

తమ్ముడు తారక్ నీ నమ్మకం నిజమైంది. థాంక్స్ ఎలాట్ నాన్న. ఎవరూ చూడనప్పుడు నువ్వు చూశావు. సినిమా గొప్పగా ఆడుతుందని చెప్పావు. నీ అంచనా కరెక్ట్ అయింది. థ్యాంక్స్. కలలపైన నమ్మకం ఉండే ఈ సినిమా చేశాను. కలలతో కాన్సెప్ట్ బాగుందని నమ్మాను అని కల్యాణ్ రామ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X