twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇజం’ బడ్జెట్, అప్పుల విషయమై స్పందించిన కళ్యాణ్ రామ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా, తాను నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'ఇజం'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. అయితే సినిమా రిలీజ్ ముందు రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

    సినిమాకు భారీగా రూ. 25 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని, సినిమాకు అనుకున్న మేర బిజినెస్ జరుగలేదని, రూ. 5 కోట్ల నష్టానికి అంటే 20 కోట్లకి కల్యాణ్ రామ్ సినిమా హక్కులను అమ్మాడంటూ వార్తలొచ్చాయి. ఓం 3డి తర్వాత కళ్యాణ్ రామ్ అప్పుల్లో మునిగి పోయారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

    kalyan ram

    దీనిపై కళ్యాణ్ రామ్ ఇటీవల ఇంటర్వ్యూలో స్పందించారు. ఇజం సినిమా అంత భారీ బడ్జెట్‌ ఖర్చు చేయలేదని, కాకపోతే అనుకున్న దాని కన్నా కొంచెం అటూ..ఇటూగా ఖర్చైందని, అది కూడా నా కెరీర్ దృష్టలో పెట్టుకుని, నా కోసం ఖర్చు పెట్టుకున్నదే అన్నారు.

    అదే విధంగా తాను అప్పుల్లో ఉన్నాననే వాస్తల్లోనూ నిజం లేదన్నారు. ఒకవేళ తాను ఆర్థికంగా తాను అంతగా దిగజారిపోతే సినిమాలను ఎలా తీయగలను, అలాంటిదేమీ లేదు, అంతా రూమర్స్ అంటూ కల్యాణ్ రామ్ కొట్టిపారేసారు. ఇకపై బయటి బేనర్లలో కూడా సినిమాలు చేస్తానన్నారు.

    English summary
    Talking about the speculations of ‘Ism’ getting released with Rs 5crore deficit, Kalyanram said, ‘I didn’t spend too much on Ism. The amount spent was needed considering the scale of the project. I am confident that it will be a profitable venture for everyone involved.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X