పగ,ప్రతీకారంతో రగిలిపోయే కుర్రాడి కథే: కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...''ఎవరైనా తాము వెళ్తున్న మార్గాన్ని వదిలి మరో వైపు అడుగులు వేశారంటే దానికో బలమైన కారణం ఉంటుంది. మా కథలోనూ ఓ యువకుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతాడు. అతను ఎవరి మీద పగ సాధించాల్సిన అవసరం ఏర్పడిందన్నది తెర మీదే చూడాలి''అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్.
అలాగే మాస్, యాక్షన్ అంశాలకు పెద్ద పీట వేసిన కథ ఇది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే ఉద్దేశంతో త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించి చిత్రించాం. త్రీడీలో వచ్చే పోరాటాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి . యాక్షన్ ప్రధానమైన కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం జత కూడాయి అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ... యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాన్ని త్రీడీలో చూపించడం కత్తి మీద సాములాంటిదే. చిత్రీకరణ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్ పనులు సాగించాం. అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. స్టెప్ అప్3, ఫైనల్ డెస్టినేషన్, స్పైడర్‌మేన్4, అవతార్, రెసిడెంట్ ఈవిల్ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్ ఎపిక్, త్రీడీ రిగ్ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్ చేశాం అన్నారు.
ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్‌టేలర్, మార్కస్, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.


Click it and Unblock the Notifications












