బాబాయ్ ఫోన్ చేశారు, మా అన్నయ్య 20ఏళ్ల వయసులో.. వెంటనే ఎన్టీఆర్‌కు ఫార్వర్డ్ చేశా.. కళ్యాణ్ రామ్!

Recommended Video

NTR Biopic : Kalyan Ram About His Look As Harikrishna In NTR Biopic | Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం జనవరి 9న విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రనికి కళ్ళకు కట్టినట్లు వెండితెరపై ఆవిష్కరించాలని బాలయ్య గట్టి ప్రయత్నం చేశారు. భారీ బడ్జెట్ లో, స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం రూపొందడం విశేషం. ముందుగా ఎన్టీఆర్ సినీరంగానికి సంబందించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

 నాకు నమ్మకం లేదు

నాకు నమ్మకం లేదు

కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ నా లుక్ సెట్ చేసిన చాలా మంది ఫోటోలు చూసి నాన్నగారిలాగే ఉన్నానని అన్నారు. కానీ నాకు మాత్రం నమ్మకం కుదర్లేదు. నేను సాధారణంగానే నాన్నగారిలా ఉండను. ఆయన లావుగా ఉంటారు. ఆయనది ఉంగరాల జుట్టు. అప్పటికి ఎంతో కష్టపడి 10 కేజీలుపెరిగా. ఇంకో 20 కేజీలు లావు పెరిగితే కానీ ఆయనలా కనిపించను అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

బాబాయ్ ఫోన్ చేశారు

బాబాయ్ ఫోన్ చేశారు

దర్శకుడు క్రిష్ కి నా లుక్ నచ్చింది. బాబాయ్ కూడా ఫోటోలు చూసి వెంటనే ఫోన్ చేశారు. ఈ సమయంలో ఈయన ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని అనుకున్నా. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. అద్భుతంగా ఉన్నావు నాన్నా.. నీ లుక్ చాలా బావుంది. 20 ఏళ్ల వయసులో మా అన్నయ్య ఎలా ఉండేవారో అలానే ఉన్నావు అని బాబాయ్ అన్నారు. బాబాయ్ ప్రశంసించడంతో చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే జూ. ఎన్టీఆర్ కి నా ఫోటోలు పంపా.

 ఊహించలేదు

ఊహించలేదు

ఫోటోలు పంపించి ఎలా ఉన్నాయి నాన్న అని ఎన్టీఆర్ ని అడిగాను. అరె.. చాలా బాగా సెట్ అయింది అయింది అన్నా.. ఊహించలేదు అని ఎన్టీఆర్ అన్నాడు. నాన్నగారికి ఉంగరాల జుట్టు ఉంటుంది. నాకు అది బాగాసెట్ కావడంతో అందరికి నచ్చేసింది అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. తొలి రోజు సెట్ లో బాబాయ్ కి నాకు మధ్య సీన్స్ లేవు. అయినా కూడా అయన వచ్చి నా నటనని గమనించారు. ఆయన ముందు కంగారు పడుతూనే నటించాను అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

చూడడానికే వచ్చా

చూడడానికే వచ్చా

నేను ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కి వెళ్లిన మొదటి రోజు బాబాయ్ సన్నివేశంలేదు. ఆయన రాగానే ఆశ్చర్యపోయా. మీరొచ్చారు ఏంటి బాబాయ్ అని అడిగా. ఎం రాకూడదా అని అన్నారు. ఇవాళ మీ సన్నివేశం లేదని అన్నారు అందుకే అడిగా అని బదులిచ్చా. ఏం లేదు.. నువ్వెలా నటిస్తున్నావో చూడాలని వచ్చా. మా అన్న ఎలా నటిస్తున్నాడో చూడాలని వచ్చానని బాబాయ్ అన్నారు. అంతే.. గురువు నా ముందు బెత్తంతో నిలబడ్డట్లుగా అనిపించింది. కంగారు పడుతూనే నటించానని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X