జూ. ఎన్టీఆర్ నటన, రిలేషన్ పై కళ్యాణ్ రామ్..

By Srikanya

హైదరాబాద్ : కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల మధ్య ఈ మధ్య ఇద్దరికీ పడటం లేదని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి..ఈ నేపధ్యంలో కళ్యాణ్ రామ్ ని మీడియావారు ప్రశ్నించారు. దానికి కళ్యాణ్ రామ్ సమాధానం చెప్తూ... నాకూ తారక్ (జూనియర్ ఎన్టీఆర్)కూ మంచి ర్యాపో ఉంది. మేం భుజాలపై చేతులేసుకొని తిరుగుతాం' అని చెప్పితే.. ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మరు. కలుసుకున్నప్పుడు మాత్రం మేం బాగుంటాం అన్నది నిజం. మొన్నే నా బర్త్‌డే రోజు తను విష్ చేశాడు కూడా అన్నారు.

అలాగే... మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... నేను ఒకరితో సరిగ్గా ఉండకపోవడం కానీ, నేనంటే ఎవరికైనా పడకపోవడం కానీ జరగదు. ఎందుకంటే నేను అందరితో బావుంటాను. అందరూ బావుండాలని కోరుకుంటాను. మనం బతికేది మహా అయితే అరవై ఏళ్లు. ఇప్పటికే ముప్ఫైఅయిదేళ్లు అయిపోయాయి. ఉన్న ఈ చిన్న సమయంలో గొడవలు, పగలు, ప్రతీకారాలు అవసరమా... చెప్పండి? నా మెంటాలిటీకి అది పూర్తి విరుద్ధం అన్నారు.

తొలిసారిగా ఎన్టీఆర్‌ని ఎప్పుడు చూశానో చెప్తూ... తెరపైనే చూశా. అప్పుడు నేను యూఎస్‌లో ఉన్నా. 'బాల రామాయణం' సినిమా విడుదలైంది. తొలిసారి రాముడిగా తనను చూశా. ఫస్ట్‌టైం తనను చూడగానే అమేజింగ్‌గా అనిపించింది. చాలా బాగా చేశాడని మనసులోనే అభినందించుకున్నాను. నేను ఇప్పటికీ చెబుతాను. వాడు అమేజింగ్ యాక్టర్ అన్నారు.

ఇక ఇద్దరు ఫస్ట్ టైమ్ కలవటం గురించి చెప్తూ... నా 'తొలిచూపులోనే' షూటింగ్ వైజాగ్‌లో జరుగుతున్నప్పుడు తనను తొలిసారి కలిశాను. అప్పుడు తన 'సింహాద్రి' షూటింగ్ అక్కడే జరుగుతోంది. అలాగే ... నాతో మరొకర్ని కంపేర్ చేసి నేను చూడను. నా స్థానం గురించే నేను ఆలోచిస్తుంటా. ఇక తారక్ విషయం అంటారా... తాను స్టార్ అవ్వడం నాన్నకు కొండంత ఆనందాన్నిచ్చింది. ఆయన కళ్ళలో నేటికీ ఆ ఆనందాన్ని చూస్తున్నాను. ఒక కొడుగ్గా అంతకంటే నాకేం కావాలి.

నటవారసత్వం కొనసాగడం ఇక్కడ ముఖ్యం. అది నేనైతే ఏంటి.. తారక్ అయితే ఏంటి? చిరంజీవిగారి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చారు. దాదాపు అందరూ సక్సెస్ అయ్యారు. అందుకని వాళ్లు ఒకళ్లని చూసి ఒకళ్లు కుళ్లుకుంటారా? లేదుకదా. అసలు ఈ విషయం గురించి ఇప్పటివరకూ నేను ఆలోచించలేదు. ఇప్పుడు మీరు అడిగాక ఆలోచించాల్సి వస్తోంది అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X