»   » కళ్యాణ్ రామ్ న్యూ మూవీ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ సందడి (ఫోటోస్)

కళ్యాణ్ రామ్ న్యూ మూవీ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకం సమర్పణలో కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో లాంఛంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ముహుర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందించారు. ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈచిత్రానికి పని చేస్తున్నారు.

రొమాంటిక్‌ కామెడి

రొమాంటిక్‌ కామెడి

నందమూరి కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ... 13 సంవత్సరాలుగా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఎంత డిఫరెంట్‌ సినిమా చేసినా అందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే ఉన్నాయి. కానీ తొలిసారి జయేంద్రగారి స్క్రిప్ట్‌ విన్న తర్వాత కొత్తగా అనిపించింది. మంచి రొమాంటిక్‌ కామెడి సినిమాలో చేయాలని చాలా రోజులుగా కోరిక ఉండేది. ఈ సినిమాతో కోరిక తీరనుంది అన్నారు.

Jai Lavakusha Story character stolen by NTR..? | Filmibeat Telugu
ఆయనతో పని చేయడం గౌరవం

ఆయనతో పని చేయడం గౌరవం

పి.సి.శ్రీరాంగారితో కలిసి పనిచేయడం గౌరవంగా ఉంది. ఈ సినిమాలో ఆయన అందరికీ కొత్త కల్యాణ్‌ రామ్‌ ను చూపిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా ద్వారా ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా పరిచయం అవుతుందని కళ్యాణ్ రామ్ తెలిపారు.

దర్శకుడు జయేంద్ర

దర్శకుడు జయేంద్ర

దర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌గారితో రొమాంటిక్‌ మూవీ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. కల్యాణ్‌రామ్‌గారు సరికొత్త మేకోవర్‌లో కనపడతారు. ఆయనతో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఐశ్వర్యలక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌తో జర్నీ చేయడం హ్యాపీగా ఉంది'' అన్నారు.

షూటింగ్ షెడ్యూల్

షూటింగ్ షెడ్యూల్

నిర్మాతల్లో ఒకరైన మహేష్‌ కొనేరు మాట్లాడుతూ... ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.1 ఇది. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఏర్కాడ్‌లో స్టార్ట్‌ అవుతుంది. ఆగస్ట్‌ 5 నుండి 7 వరకు అక్కడే షూటింగ్‌ చేస్తాం. తర్వాత ఆగస్ట్‌ 15 నుండి సెప్టెంబర్‌ చివరి వారం వరకు సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

నిర్మాతలు విజయ్, కిరణ్

నిర్మాతలు విజయ్, కిరణ్

నిర్మాతలు విజయ్‌కుమార్‌ వట్టికూటి, కిరణ్ ముప్పవరపు మాట్లాడుతూ - ''సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న వ్యక్తులందరూ ఓ టీమ్‌గా ఏర్పడి చేస్తున్న సినిమా ఇది. కల్యాణ్‌గారి పాజిటివ్‌ ఎనర్జీతో అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. శరత్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందిస్తారని భావిస్తున్నాం. సుభాగారు అద్భుతమైన స్క్రిప్ట్‌ను అందించారు. జయేంద్రగారి విజన్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేపు స్క్రీన్‌పై చూస్తారు. పి.సి.శ్రీరామ్‌ వంటి గొప్ప టెక్నిషియన్‌తో వర్క్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నాం'' అన్నారు.

తెరవెనక

తెరవెనక

నందమూరి కల్యాణ్‌రామ్‌, ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: సెల్వకుమార్‌, ఎడిటర్‌: టి.ఎస్‌.సురేష్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:సి.కమల్‌ కన్నన్‌, యాక్షన్‌: విజయ్‌, మాటలు: జయేంద్ర, సుభా, మీరాగ్‌, కథ, కథనం: జయేంద్ర, సుభా, సంగీతం: శరత్‌, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, నిర్మాతలు: కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి, దర్శకత్వం: జయేంద్ర.

English summary
Kalyan Ram, Aishwarya Lakshmi, Jayendra new film launched. Jr NTR, Nandamuri Kalyanram, Aishwarya Lekshmi, Nandamuri HariKrishna, Shyam Prasad Reddy, PC Sreeram, Akkineni Ramesh Prasad, BVSN Prasad, Krish, Prasad V. Potluri at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu