twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణపై ఎన్టీఆర్ చేయి వేసి.. 30 ఏళ్ల తరువాత మా బాబాయ్‌తో!

    |

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు భాగాలుగా ఈచిత్రం తెరకెక్కుతోంది. బాలయ్య స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే ప్రముఖ నటీనటులు ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ విభిన్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, పైగా బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తునడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత విశేషాలని దర్శకుడు క్రిష్ వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేశారు.

     హరికృష్ణ పాత్రలో

    హరికృష్ణ పాత్రలో

    కళ్యాణ్ రామ్ నటిస్తున్నది స్వయంగా తన తండ్రి హరికృష్ణ పాత్రలోనే. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో హరికృష్ణ ఎంత కీలక పాత్ర పోషించారో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ కు రథసారధిగా మారి వేలమైళ్ళు ప్రచార రథాన్ని నడిపించారు. ఎన్టీఆర్ తో కలసి అనేక చిత్రాల్లో కుడా హరికృష్ణ నటించారు.

    30 ఏళ్ల తరువాత

    30 ఏళ్ల తరువాత

    ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో ఉన్న తన ప్రీలుక్ ని కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ ముఖం కనిపించకుండా వెనుకకు తిరిగి ఉన్నాడు. 30 ఏళ్ల క్రితం నేను బాబాయ్ తో కలసి బాలగోపాలుడు చిత్రంలో నటించా, మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కలసి నటిస్తున్నామని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

    మా నాన్నగారిలా

    బాబాయ్ వాళ్ళ నాన్నగారిలా, నేను మా నాన్నగారిలా నటిస్తున్నాం అంటూ ఎన్టీఆర్ బయోపిక్ లోని స్టిల్ విడుదుల చేశాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య, హరికృష్ణ పాత్రలో ఉన్న కళ్యాణ్ రామ్ ప్రచార రథం వద్ద నిలబడి ఉన్నారు. బాలయ్య కళ్యాణ్ రామ్ పై చేయి వేసి మంతనాలు జరుపుతున్నట్లు ఈ స్టిల్ ఉంది.

     తండ్రితో కలసి

    తండ్రితో కలసి

    హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలసి దానవీర సూర కర్ణ, తాతమ్మ కల వంటి చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తండ్రికి రథసారధిగా మారి ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండడంతో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవలే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

    ప్రముఖ నటీనటులు

    ప్రముఖ నటీనటులు

    హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండగా మిగిలిన పాత్రలకు కూడా ప్రముఖ నటీనటులు ఎంపికయ్యారు. చంద్రబాబు పాత్రలో రానా, ఏఎన్నార్ పాత్రలో సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది.

    English summary
    Kalyan Ram as Harikrishna in NTR biopic. Kalyan Ram remembers Bala Gopaludu movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X