కళ్యాణ్ రామ్ డేంజరస్ వీడియో.. అంత రిస్క్ అవసరమా అంటున్న ఫ్యాన్స్!
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 118. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ కోనేరు ఈ చిత్రానికి నిర్మాత. నివేత థామస్, షాలిని పాండే ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ 118 చిత్రంతో తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కుతోంది. ఈ చిత్రానికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డేంజరస్ వీడియో వైరల్
కళ్యాణ్ రామ్ 118 కోసం చేస్తున్న ఓ రిస్క్ చాలా ప్రమాదకరంగా ఉంది. నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అపాయంతో చెలగాటం వద్దని నందమూరి ఫ్యాన్స్ నలయం రామ్ ని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి డూప్ లేకుండా ఇలాంటి ప్రమాదకర షాట్స్ కళ్యాణ్ రామ్ చేస్తున్నారు తెలుస్తోంది. ఒరిజినాలిటీ కోసం కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడట.
ఊపిరి బిగబట్టి
118 చిత్రంలో నీటి అడుగున నటించే సన్నివేశాలు ఉంటాయట. ఆ సన్నివేశాల కోసం కళ్యాణ్ రామ్ ఎక్కువ సమయం నీటిలో ఊపిరి బిగబట్టి ఉండేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా ప్రయత్నిస్తున్న సమయంలో తీసిన వీడియోనే ఇది. ఈ వీడియోని చిత్ర నిర్మాత మహేష్ కోనేరు ట్విట్టర్ లో షేర్ చేశారు. కొంతమంది నెటిజన్లు కళ్యాణ్ రామ్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నప్పటికీ, మరికొంత మంది అంత రిస్క్ వద్దని హెచ్చరిస్తున్నారు.

జనవరిలో విడుదల
118 చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోంది. అద్భుతమైన థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 118 చిత్రంతో పాటు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

హిట్ కోసం
కళ్యాణ్ రామ్ కు పటాస్ చిత్రం తరువాత సరైన విజయం దక్కలేదు. కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ఎమ్మెల్యే లాంటి కమర్షియల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత నా నువ్వే లాంటి రొమాంటిక్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. నా నువ్వే కూడా నిరాశ పరచడంతో ఇప్పుడు థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











