వింత కథ ఎంచుకున్న కళ్యాణ్ రామ్.. అన్నింటికీ సిద్దమేనా..!
Recommended Video

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్నింటికీ సిద్దపడిపోయినట్లు ఉన్నాడు. నందమూరి హీరో సినిమా అంటే అభిమానుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల్ని కొంచెం కష్టమే. కొన్ని రకాల కథలు బావున్నా, అభిమానుల్లోనే అంచనాల దృష్ట్యా స్టార్ హీరోలు వాటికి కమిట్ కాలేరు. కానీ కళ్యాణ్ రామ్ అన్నింటికీ తెగించేసినట్లు ఉన్నాడు. నూతన దర్శకుడు వినిపించిన వింత తరహా కథకు కళ్యాణ్ రామ్ ఒకే చెప్పదనేది తాజా సమాచారం.

చాలా కాలం తరువాత బ్లాక్ బాస్టర్
కళ్యాణ్ రామ్ కు వరుసగా ప్లాపులు ఎదురవుతున్న తరుణంలో పటాస్ చిత్రం ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. పటాస్ చిత్రం కళ్యాణ్ రామ్ కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. అంతలోనే కళ్యాణ్ రామ్ కు ఇజం, షేర్ రూపంలో ప్లాపులు ఎదురయ్యాయి.

స్నేహితుడితో నష్టాలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ కు అంతగా కలసి రాలేదనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో అతి పెద్ద విజయం అతనొక్కడే. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. అప్పటి నుంచి కళ్యాణ్ రామ్, సురేందర్ రెడ్డి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్ 2 చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించాడు. కిక్ 2 కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాలు మిగిల్చింది.

ఆదుకున్న తమ్ముడు
కిక్ 2 వలన ఎదురైన నష్టాల నుంచి కళ్యాణ్ రామ్ ని ఎన్టీఆర్ ఆడుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వార్తలని సభాముఖంగా ఎన్టీఆర్ ఖండించాడు. ఆ తరువాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కే నిర్మాతగా మారాడు. వీరికాంబినేషన్ లో వచ్చిన జై లవ కుశ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలింది. నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు కూడా సంతృప్తి నిచ్చింది.

ఎమ్మెల్యేగా పాలిటిక్స్ పై గురి
కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఎమ్మెల్యే పేరుతో పొలిటికల్ కథ ఒకటైతే, మరొకటి నా నువ్వే చిత్రం. ఈ రెండు చిత్రాలు వేసవి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త కథతో అనూహ్య నిర్ణయం
నూతన దర్శకుడు విజయ్ మద్దల వివరించి సస్పెన్స్ థ్రిల్లర్ కథ కళ్యాణ్ రామ్ కు బాగా నచ్చిందట. ఈ కథలోని ట్విస్ట్ లు కళ్యాణ్ రామ్ ని ఆశ్చర్యానికి గురి చేశాయని, దీనితో దర్శకుడికి వెంటనే ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

అన్ని రకాలా ప్రయోగాలు
కళ్యాణ్ రామ్ తాజాగా నిర్ణయం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసేదే. సస్పెన్స్ తరహా కథలు చేయడానికి మాస్ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు ఆసక్తి చూపరు. కానీ కళ్యాణ్ రామ్ ఇకపై అన్ని రకాల ప్రయోగాలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











