Devil US Advance Booking.. ఓవర్సీస్‌లో డెవిల్ ఓపెనింగ్స్ దారుణంగా.. కల్యాణ్‌రామ్‌ మూవీ కంటే సుమ కొడుకే టాప్!

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు చేసే హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. బింబిసార లాంటి హిట్ తర్వాత కల్యాణ్ రామ్ అమిగోస్ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నారు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ మరో ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇప్పటికే ప్రిమియర్ షోలు పడ్డాయి. థియేటర్ వద్ద పర్వాలేదనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఓవర్సీస్ లో సుమ కొడుకు రోషన్ కనకాల దెబ్బ తీశాడు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా, సుమ కొడుకు రోషన్ కనకాల ఫస్ట్ మూవీ బుబుల్ గమ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది మరో ప్రయోగాత్మక చిత్రం. బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇందులో ఓ హత్య జరగడం.. దానిని చేధించేందుకు సీక్రెట్ ఏజెంట్ ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్టుతో ఈ మూవీని తెరకెక్కించారు.

Recommended Video

కళ్యాణ్ రామ్ మూవీని తొక్కేసిన Anchor Suma కొడుకు Devil Vs Bubble Gum | Telugu Filmibeat

Kalyan Ram Devil Movie advance bookings are lower than Suma Son Roshan Kanakala Bubble Gum Movie in Overseas Full Details Here

ఇక కల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా రికార్డు స్థాయిలో బిజినెస్ నమోదు చేసుకుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.00 కోట్ల బిజినెస్ నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

ఇక ఈ సినిమాకు పోటీగా సుమ కొడుకు రోషన్ కనకాల సినిమా బబుల్ గమ్ రిలీజ్ అయింది. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి హిట్ సినిమాలు తీసిన రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తెలుగు అమ్మాయి మానసా చౌదరి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల యాక్టింగ్ సూపర్ అని అంటున్నారు.

Kalyan Ram Devil Movie advance bookings are lower than Suma Son Roshan Kanakala Bubble Gum Movie in Overseas Full Details Here

ఇక ఇదిలా ఉంటే... నందమూరి కల్యాణ్ రామ్ సినిమాను రోషన్ కనకాల దెబ్బకొట్టాడని తెలుస్తోంది. ఓవర్సీస్ లో నందమూరి కళ్యాణ్‌రామ్ డెవిల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే అందులో ఆశ్చర్యకరంగా సుమ రాజీవీ కొడుకు రోషన్‌ కనకాల నటించిన బబుల్‌ గమ్ సినిమాకు అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. దీనితో కల్యాణ్ రామ్ ను రోషన్ కనకాల చావు దెబ్బ కొట్టారనే చెప్పాలి.

ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాకు 1,686 డాలర్లు రాగా... డెవిల్ సినిమాకు 78 డాలర్లే వచ్చాయి. ఇక నాని నటించిన హాయ్ నాన్నకు 22వ రోజు అయినప్పటికీ 1,827 డాలర్స్ రాగా... డెవిల్ సినిమాకు కేవలం 78 డాలర్స్ రావడం ఏంటి అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇక ఇండియాలో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X