సునీల్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ 3డి చిత్రం
త్వరలో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ త్రీడి చిత్రం చేయనున్నారు.రసూల్ ఎల్లోర్ ఒకరికి ఒకరు చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన సునీల్‌రెడ్డిని ఈ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయం చేయనున్నారు. ఈ చిత్రానికి సంభంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తైనట్లు తెలుస్తోంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఇంతకుముందు తన భ్యానర్ లో కళ్యాణ్ రామ్ అతనొక్కడే,హరేరామ్,జయీభవ చిత్రాలు నిర్మించారు. కత్తి చిత్రం తర్వాత ఆయన మరే చిత్రం కమిట్ కాలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్నారు. ఇక అల్లరి నరేష్ హీరోగా నిర్మాత అనీల్ సుంకర సైతం ఓ త్రీడి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సునీల్ రెడ్డి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ శిష్యుడు.ఆయన వద్ద భగీరధ,ఒకరికి ఒకరు చిత్రాలకు పనిచేసారు. మంచు మనోజ్ తో చేసిన నేను మీకు తెలుసా చిత్రం బాగా పేరు తెచ్చుకుంది. నందమూరి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు, సాంకేతిక విభాగానికీ ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెప్తున్నారు.ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తున్నారు. చిజిల్డ్ బాడీతో ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. అందు కోసం నిపుణులైన శిక్షకుల దగ్గర తర్ఫీదు తీసుకొంటున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


Click it and Unblock the Notifications











