twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ పోలీసులు కమల్ హాసన్ లెక్క.. మీరేమో నానిలాగా.. ట్రాఫిక్ రూల్స్‌పై హైపర్ ఆది!

    |

    హైదరాబాద్ పోలీసులు నగర వ్యాప్తంగా 30వ రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోమ్ మంత్రి మహమ్మద్ అలీ, సినీ నటుడు కళ్యాణ్ రామ్ అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో రోడ్డు ప్రమాదాల ఘటనలు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, అతివేగం వంటి కారణాల వలనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయనేది వాస్తవం. దీనిపై పోలీసులు ఎన్ని ట్రఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు జరిపినా ఫలితం లేకుండా పోతోంది. కళ్యాణ్ రామ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన ఆవశ్యకతని వివరించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, అదిరే అభి కూడా పాల్గొన్నారు.

    అన్నయ్య, నాన్న ప్రాణాలు కోల్పోయారు

    అన్నయ్య, నాన్న ప్రాణాలు కోల్పోయారు

    ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అందరికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలుసు కానీ నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈ నిర్లక్ష్యం వలన కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి అంతా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఒక్క నిమిషం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగడం వలన సమయం మించిపోదు. ప్రాణం కంటే ఏది విలువైంది కాదు అని కళ్యాణ్ రామ్ అన్నారు. మా కుటుంబంలోనే రోడ్డు ప్రమాదాల వలన అన్నయ్య, నాన్నని కోల్పోయాం అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

    మీ కుటుంబాలు

    మీ కుటుంబాలు

    కారు, బైక్స్ వేగంగా నడపకూడదు అని అందరికి తెలుసు. బైక్ పై వెళ్లే సమయంలో హెల్మెట్ ఉపయోగించాలి. కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. రాంగ్ రూట్ లో వెళ్ళకూడదు. సిగ్నల్ జంప్ చేయకూడదు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అందరం ట్రాఫిక్ నిబంధనల్ని నిర్లక్ష్యం కారణంగా అతిక్రమిస్తుంటాం అని కళ్యాణ్ రామ్ అన్నారు. దీనివలన ప్రమాదాలు జరిగితే మీ కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయి అని కళ్యాణ్ రామ్ హెచ్చరించారు.

    హోమ్ మంత్రి

    హోమ్ మంత్రి

    ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి మాహమద్ అలీ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకం. అలాంటి యువతే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. జరుగుతున్న ప్రమాదాల్లో 70 శాతం యువతే ఉంటున్నారు. తెలంగాణ పోలీసులు కొంతమేర రోడ్డు ప్రమాదాల్ని కంట్రోల్ చేయగలిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత గురించి కామెడీ స్కిట్ రూపంలో జబర్దస్త్ టీం తెలియజేసింది. హైపర్ ఆది, అదిరే అభి, అవినాష్ లాంటి జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొన్నారు.

     హైపర్ ఆది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయలేడు

    హైపర్ ఆది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయలేడు

    అదిరే అభి సరదాగా మాట్లాడుతూ హైపర్ ఆది గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. హైపర్ ఆది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడు. చేయలేడు అని తెలిపాడు. దానికి కారణం హైపర్ ఆదికి డ్రైవింగ్ రాదు. ఐదేళ్ల నుంచి చెబుతున్నా నేర్చుకోవయా అని. ఇలాంటివన్నీ ఉంటాయనే నేర్చుకోలేదు అని హైపర్ ఆది సరదాగా వ్యాఖ్యానించాడు. తనదైన శైలిలో పంచులు పేల్చాడు.

    కమల్ హాసన్‌‌లాగా

    కమల్ హాసన్‌‌లాగా

    ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలని హైదరాబాద్ పోలీసులు తరచుగా నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లాగా చెబుతుంటారు. కానీ మీరేమో భలే భలే మగాడివోయ్ సినిమాలో నానిలాగా మరచిపోతుంటారు. అసలు ఎవరూ సిగ్నల్స్ ని పట్టించుకోవడంలేదని హైపర్ ఆది తెలిపాడు. ట్రాఫిక్ పోలీస్ అటు తిరిగి ఉంటె సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతారు. లేకుంటే ఆగుతారు అని తెలిపారు. యువత రాత్రిపూట వాహనాల్లో ప్రయాణించడం తగ్గించాలని హైపర్ ఆది కోరాడు.

    English summary
    Kalyan Ram Emotional Speech at Rachakonda Police Traffic Awareness Program
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X