కళ్యాణ రామ్ హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో యన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రానికి 'హరే రామ్ 'అనే పేరు ఖరారు చేసారు. దీనికి మొదట 'ఒక్కడొచ్చేసాడు' అనే టైటిలు అనుకున్నారు. కాని కళ్యాణ రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న దీనికి 'హరే రామ్' టైటిల్ అయితే రెండు పాత్రల పేర్లు కలసి పెట్టినట్లు యాప్ట్ గా ఉంటుందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర దర్శకుడు హర్షవర్ధన్ గతంలో బాలకృష్ణతో 'విజయేంద్ర వర్మ'ని స్వర్ణ సుబ్బారావు పేరుతో డైరక్ట్ చేసాడు. కలసివస్తుందని న్యూమరాలజీ ప్రకారం ఆయన పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తన స్వీయ బేనరు యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో 'అతడొక్కడే ' సినిమా నిర్మించి యాక్షన్ హీరోగా స్థిరపడ్డ కళ్యాణ రామ్ రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా ఇది. నిజానికి కళ్యాణ రామ్,దర్శకుడు హర్షవర్ధన్ ఇద్దరూ భారీ ఫ్లాపుల్లో ఉన్నవారే. దాంతో అన్ని జాగ్రత్తలూ తీసుకుని కసితో చిత్రాన్ని నిర్మించారంటున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.