మెగా ఫ్యామిలీ మూవీ హిట్, నందమూరి హీరో సంబరం!

హీరోగా తనకు కలిసి రాక పోవడంతో కళ్యాణ్ రామ్ తన దృష్టంతా సినిమా నిర్మాణ రంగంపైనే పెట్టారు. త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా 'కిక్ 2' చిత్రాన్ని నిర్మించేందుక ప్లాన్ చేస్తున్నారు. తనతో చేయబోయే 'కిక్ 2' చిత్రానికి ముందు సురేందర్ రెడ్డి 'రేసు గుర్రం'తో హిట్ కొట్టడమే కళ్యాణ్ రామ్ సంతోషానికి కారణం.
ఒక దర్శకుడు హిట్ కొట్టిన తర్వాత తీసే సినిమాకు మార్కెట్లో క్రేజ్ బాగా ఉంటుంది. ఇది తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'పవర్' చిత్రం పూర్తి కాగానే 'కిక్ 2' చిత్రం ప్రారంభం కానుంది. . 'కిక్' మూవీ అప్పట్లో భారీ విజయం సాధించిన నేపథ్యంలో....అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కిక్-2 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సొంత బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో 'అతనొక్కడే' చిత్రం తర్వాత ఒక్క హిట్ట కూడా లేదు. ఈ నేపథ్యంలో 'కిక్ 2' చిత్రం తన బేనర్‌కు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాడు కళ్యాణ్ రామ్. తన సొంత బేనర్లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన నాలుగు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











