కళ్యాణ్ రామ్ 'కత్తి' నూరటం ఎంతవరకూ వచ్చింది
కళ్యాణ్ రామ్ హీరోగా మల్లి దర్సకత్వంలో..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రెడీ అవుతున్న 'కత్తి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మణిశర్మ అందించిన ఈ చిత్రం ఆడియోని దసరాకి మార్కెట్ లోకి వదలాలని నిర్ణయించారు. అలాగే చిత్రాన్ని వచ్చే నెల రెండో వారంలో రిలీజ్ చేయాలని నిర్ణయంచారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సనా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె ఇంతకుముందు ఓ తమిళ చిత్రం చేసింది. ఇక విలేజ్ లో వినాయకుడు చిత్రంలో చేసిన శరణ్యా మోహన్..కళ్యాణ్ రామ్ చెల్లిగా కీరోల్ చేస్తోంది. రవితేజ కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా చేసిన శ్యామ్ మరో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ 'కత్తి' టైటిల్ ని ప్రముఖ నిర్మాత దానయ్య మెదట రిజిస్టర్ చేయంతో సమస్య ఏర్పడింది. అయితే కళ్యాణ్ రామ్ స్వయంగా ఆ నిర్మాతను కలిసి టైటిల్ ని అడగటంతో..బేరసారాలు లేకుండా కేవలం రాయబారాలునే ఈ సమస్య తీరిందని తెలుస్తోంది. దాంతో అఫీషయల్ గా తన చిత్రానికి కత్తి అనే టైటిల్ ని ప్రకటించారు కళ్యాణ్ రామ్.


Click it and Unblock the Notifications











