రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 'కళ్యాణ్ రామ్ కత్తి'(స్టోరీ లైన్)
కళ్యాణ్ రామ్ తాజా చిత్రం కళ్యాణ్ రామ్ కత్తి. అతను ఈ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ రామకృష్ణ (కల్యాణ్ రామ్) గా కనిపించనున్నారు. కుటుంబంపై వల్లమాలిన ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలతో అతని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అతని లవ్..అంజలి(సనా ఖాన్) కాలేజీ అమ్మాయి. రామకృష్ణ, అంజలి మధ్య చిగురించిన ప్రేమ కాస్తా కథలో కీలక మలుపులకు కారణమవుతుంది. ఇక బావ కృష్ణమోహన్ (శ్యామ్), చెల్లెలు హరిత (శరణ్యా మోహన్)లు కోసం కత్తి పట్టాల్సిన సిట్యువేషన్ వస్తుంది. సెకెండాఫ్ లో కథ హైదరాబాద్ నుంచి రాయలసీమ కు మారుతుంది. అక్కడకు ఎందుకు వెళ్ళాల్సివచ్చింది..అక్కడేం జరిగింది..ఈ సరదా కుర్రాడు హఠాత్తుగా కత్తి పట్టి ఎందుకు పట్టవలసి వచ్చిందనేది ఉత్కంఠభరితంగా సాగుంతుందంటున్నారు. సెంటిమెంట్, యాక్షన్ కలిగలిపి తయారు చేసిన కథ ఇది. ఈ రోజే (నవంబర్ 12న) విడదల అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











